బోల్డ్ బ్యూటీ కిర్రాక్ సీతకు లైంగిక వేధింపులు.. ఆ రోజు ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్‌లుగా నటించిన సినిమా బేబీ. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. రిలీజ్ అయి పది రోజులు దాటినా ఇప్పటికీ బేబీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఈ సినిమాలో హీరో హీరోయిన్లతో పాటు విరాజ అశ్విన్ సెకండ్ హీరోగా నటించాడు. ఎంతోమంది స‌హ‌య న‌టులు క‌లిసి ప‌నిచేసిన ఈ మూవీలో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో నెగెటీవ్ రోల్‌లో కిర్రాక్ సీత ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొదట్లో యూట్యూబర్ సరయూతో కలిసి కొన్ని వీడియోల నటించిన కిర్రాక్ సీత ఏవో ఇబ్బందుల కారణంగా ఆ ఛానల్ నుంచి బయటకు వచ్చేసింది.

తర్వాత అడపాదడప సినిమాలలో బోల్డ్ క్యారెక్టర్స్‌లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంది. ఈ హాట్ బ్యూటీ. తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనని కొందరు సెక్సువల్ గా వేధించాలని చూశార‌ని బయటపెట్టింది. ఓ ఈవెంట్ కి నేను వెళ్లొస్తున టైంలో కొందరు ఆకతాయిలు నా వెంట పడ్డారని అప్పుడు నా ఫ్రెండ్స్ కి ఫోన్ చేస్తే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పార‌ని కానీ నేను అలా చేయలేదని కొందరైతే నన్ను రేప్ చేస్తాం, చంపేస్తామని కూడా బెదిరించారని.. మరికొందరు నా అడ్రస్ తెలుసుకోవడానికి తెగ ట్రై చేశారని వీటన్నిటిని నేను లైట్ తీసుకున్నాను అంటూ వివరించింది.

నన్ను అంతలా బెదిరించిన సరే వాటిని నేను పట్టించుకోలేదు నా రీల్ లైఫ్ క్యారెక్టర్ చూసి వాళ్లంతా ఈ అభిప్రాయానికి వచ్చారు. కానీ నా రియల్ లైఫ్ వేరు రీల్ లైఫ్ వేరు అన్న విషయం నాకు తెలుసు. బేబీ సినిమాలో ఇలాంటి పాత్రను నటించడం వలన నాకు ఈ ఇబ్బందులు ఉంటాయని డైరెక్టర్ ముందే చెప్పారు.. అని కిర్రాక్ సీత వివరించింది. ఇక ప్రస్తుతం కిర్రాక్ సీత చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి.