యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో రూపొందుతున్న దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్లో హిట్ సినిమా రావడంతో ప్రస్తుతం దేవర సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక నందమూరి నట వారసుడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ గురించి ఇటీవల బో…*ల్డ్ నటి శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
శ్రీరెడ్డి ఓ సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్కు ఎథిక్స్, వాల్యూస్ ఉన్నాయని.. తారక్ చాలా ధైర్యవంతుడని వివరించింది. పక్కా ప్లానింగ్ తో ఎన్టీఆర్ కెరీర్ పరంగా ముందుకు వెళ్తున్నాడని.. తన కుటుంబంలో ఉన్న సమస్యలను ఎన్టీఆర్ ఎక్కడా బయట పెట్టకుండా.. తన కుటుంబ పేరు ప్రఖ్యాతులు నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నాడని.. జూనియర్ ఎన్టీఆర్ తాత బ్రాండ్ కాపాడడానికి ఎంతో మానసిక క్షోభను అనుభవిస్తున్నాడని వివరించింది.
ఒకవైపు సినిమాలను, మరోవైపు అభిమానులను మేనేజ్ చేస్తూనే రాజకీయాలపై ఆసక్తి ఉన్నా కూడా కుటుంబం క్షేమంగా ఉండాలంటే పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్నాడని.. చంద్రబాబు అనంతరం టిడిపిలో తుఫాన్ వస్తుందని.. ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని వివరించింది. అప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగానే ఉంటాడని.. జూనియర్ ఎన్టీఆర్కి వాళ్ళ తాత గారిపై ఉన్న ఇష్టమే టీడీపీలో జరుగుతున్న అన్యాయాన్ని సైలెంట్ గా భరించేలా చేస్తుందని శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది.
చంద్రబాబు వల్ల తన కుటుంబానికి అపాయం ఉంటుందని శ్రీరెడ్డి చెప్పింది. బాలయ్యను చంద్రబాబు వియ్యంకుడిగా చేసుకోవడానికి కూడా ఒక పెద్ద వ్యూహం ఉందని.. ఎన్టీఆర్ ఫ్యూచర్ పొలిటిషియన్ అంటూ వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఎన్టీఆర్ గురించి శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.