‘ OG ‘ రిలీజ్ డేట్‌పై ప‌వ‌న్ ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చాడేంట్రా బాబు..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ టాలెంటెడ్ దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఓజి. సాహో లాంటి పాన్ ఇండియా యాక్షన్ సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న సుజిత్ పవన్ కోసం అదిరిపోయే యాక్షన్ కత‌ రెడీ చేసుకున్నాడు. ఈ సినిమాపై రోజురోజుకు అంచ‌నాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే దాదాపు 50% కు పైగా షూటింగ్ కూడా పూర్తయింది.

ప్రస్తుతం పవన్ లేని పోర్షన్ షూటింగ్‌ తెరకెక్కిస్తున్న సుజిత్ చాలా సీన్లు కంప్లీట్ చేసేసాడని.. ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా రిలీజ్ పై ఇప్పటికే ఇంట్రెస్టింగ్ టాక్ బయటకు వచ్చింది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ మూడో వారంలో ఓజీ సినిమాను రిలీజ్ చేస్తారు అంటూ ప్రచారం జరుగుతుంది. విశ్వస‌నీయ‌ వర్గాల సమాచారం ప్రకారం ఓజి సినిమా షూటింగ్ అనుకున్న టైంకు పూర్తయితే డిసెంబర్ మూడో వారంలోనే రిలీజ్ చేసేలా నిర్మాత డివివి.దానయ్య ప్లాన్ చేస్తున్నారు.

ఒకవేళ పవన్ రాజకీయంగా బిజీ అయి షూటింగ్ లేట్ అయితే డిసెంబర్ రిలీజ్ కానీ పక్షంలో వచ్చే ఏడాది వేసవి కానుకగా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అంటే ఏపీలో వచ్చే సాధారణ ఎన్నికల తర్వాత ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డివివీ ఎంటర్టైన్మెంట్ బ్యాన‌ర్‌పై డివివి.దానయ్య నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.