నటసింహం నందమూరి బాలయ్య ఇప్పటికే ఎన్నో ఫ్యాక్షన్, యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. బాలయ్య నటించిన ఫ్యాక్షన్ కారెక్టర్ దగ్గర నుంచి రాయల్ గా నటించే క్యారెక్టర్ వరకు బాలయ్య యాక్షన్ ఎప్పుడు పీక్స్ లోనే ఉంటుంది. ఇక బాలయ్య ఇప్పటి వరకు కత్తి పట్టిన సీన్సే గాని.. రెండు చేతుల్లో భారీ గన్ పట్టుకున యాక్షన్ సీన్లలో నటించిన సినిమాలు చాలా తక్కువగా ఉన్నాయి.
బాలయ్య ఏ సినిమాలోనైనా వన్ మ్యాన్ ఆర్మీలా శత్రువులపై వీరుచుకుపడడం ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూనే ఉంటుంది. ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న భగవంత్ కేసరి సినిమా భారీ యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో వస్తోంది. ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్, పోస్టర్ చూస్తేనే ఈ సినియాలో ఎంత యాక్షన్ దట్టించారో అర్థమవుతుంది. తాజాగా ఈ సినిమా న్యూ లుక్ పోస్టర్ మరొకటి రిలీజ్ అయింది.
ఈ పోస్టర్ లో బాలయ్య రెండు భారీ గన్నులతో శత్రువుల వైపు దూసుకుపోతూ ఉంటాడు. ఈ సన్నివేశం మాత్రం థియేటర్లో వచ్చినప్పుడు ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించేలా ఆ ఫోటో ఉంది. మామూలు యాక్షన్ సీన్స్ టైమ్ లోనే బాలయ్య అభిమానులని ఆపడం చాలా కష్టం.. అలాంటిది బాలయ్య తుపాకీ గుళ్ళు వర్షం కురిపిస్తే అభిమానులు రచ్చ ఎలా? ఉంటుందో ఓసారి ఊహించండి.
బాలయ్య కి ఏ డైరెక్టర్ కూడా ఇప్పటివరకు అంత పెద్ద గన్ తో యాక్షన్ సీన్స్ ఇవ్వలేదు. ఆ పాయింట్ క్యాచ్ చేసిన అనిల్ రావిపూడి సరిగ్గా అదే సీన్ తో మూవీని ఎన్ క్యాష్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. కాజల్ కూడా వైలెంట్ గా కనిపిస్తుందా ? లేదా బాలయ్య వైపు వలపు బాణాలు వేసే బాధ్యతలను పుచ్చుకుందో చూడాలి.