కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, బీస్ట్ ఫేమ్ నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన భారీ యాక్షన్ కామెడీ చిత్రం జైలర్. ఈ సినిమాతో రజనీకాంత్ ఈ వయస్సులోనూ తన అద్భుతమైన నటనతో తన అభిమానులను మరియు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు.
ఈ సినిమాలో రజనీకి జోడీగా మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కంప్లీట్ చేసుకుంది. జైలర్‌కు సైన్సార్ వాళ్లు యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇక ఈ సినిమా 2 గంటల 49 నిమిషాల సుదీర్ఘ రన్‌టైమ్ కలిగి ఉంది. ఆగస్ట్ 10, 2023న థియేటర్లలో విడుదల అవుతోంది.
ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్, శివ రాజ్‌కుమార్, నాగేంద్ర బాబు, రమ్య కృష్ణన్, సునీల్, వసంత్ రవి మరియు యోగి బాబు కూడా ప్రముఖ పాత్రల్లో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.
అయితే 169 నిమిషాల సుధీర్ఘమైన రన్ టైం అంటే చాలా ఎక్కువే. ఇంత రన్ టైం పెట్టుకుని చిరంజీవి భోళాశంకర్ సినిమాతో రజనీ పోటీపడడం కష్టమే. పైగా బీస్ట్ లాంటి డిజాస్టర్ ఇచ్చిన నెల్సన్ డైరెక్టర్ కావడంతో అంచనాలు లేవు. ఇక ఈ రెండు సినిమాల్లోనూ తమన్నానే హీరోయిన్.