‘ పుష్ప 2 ‘ లో రెండు క్రేజీ రూమ‌ర్లు… విల‌న్‌గా బ‌న్నీ… ర‌ష్మిక రోల్ క్లోజ్‌..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ‘ పుష్ప 2 ‘. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ‘ పుష్ప ‘ సినిమా రిలీజై సూపర్ సక్సెస్ సాధించడంతో పార్ట్ 2 లో అల్లు అర్జున్ ఎలా కనిపించబోతున్నాడు.. యాక్షన్ సీన్స్ ఎంత ఆసక్తికరంగా ఉండబోతున్నాయి అనే విషయంపై ఇప్పటికే పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న‌ శ్రీవల్లి పాత్రలో ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.
పుష్ప 2 లో శ్రీవల్లి రోల్ చనిపోతుందని వార్తలు అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ రోల్, పుష్ప కంటే ‘ పుష్ప 2 ‘ లో మోస్ట్ వైలెంట్ గా ఉండబోతుందట. ‘ పుష్ప 2 ‘ లో బన్నీ పాత్ర చాలా బలంగా ఉండబోతుందని.. నెగిటివ్ షేడ్స్ లోనూ లాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో బన్నీ క్యారెక్టర్ లో ఉండబోతుందట.

ఈ సినిమాలో డైలాగ్స్ కూడా చాలా మీనింగ్ ఫుల్ గా ఉంటాయంటున్నారు. ఈ సినిమాలో కేవలం బన్నీ క్యారెక్టర్ కోసమే నలుగురు స్క్రిప్ట్ రైటర్స్ ను కూర్చోబెట్టి మరి ఏడాది పాటు వర్క్ చేశాడట సుకుమార్. ఈ వార్తల‌లో ఎంత ? నిజం ఉందో తెలియదు కానీ.. ఇది ఏమాత్రం నిజమైనా సరే ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అవుతాయి అనడంలో సందేహం లేదు.

ఇప్పటికే పుష్ప 2 సినిమా రిలీజ్ డేట్ కోసం కోట్లాదిమంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మైత్రి మూవీ బ్యానర్స్ పై భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 2024 వేసవిలో రిలీజ్ కాబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.