యాంకర్ ప్రదీప్‌కు కాబోయే భార్య ఈమే… మొత్తం లీక్ చేసేసిందిగా…!

ప్ర‌స్తుతం తెలుగు బుల్లితెర‌పై మేల్ యాంకర్ల‌ పేరు వింటేనే గుర్తుకొచ్చేది ముందుగా ప్రదీప్ మాచిరాజు. బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. ప్ర‌స్తుతం ప్రదీప్‌కి 37 సంవత్సరాలు. ప్రదీప్ పలు సినిమాల్లో హీరోగా నటించగా ఆ సినిమాలు కూడా కమర్షియల్ గా సక్సెస్ సాధించి నిర్మాతకు లాభాలు తెచ్చిపెట్టాయి.

యాంకర్ గా, నటుడిగా, నిర్మాతగా కెరీర్ కొనసాగిస్తూ అన్ని రంగాలలో సక్సెస్ అవుతున్నాడు. గతంలో ప్రదీప్ హోస్ట్ గా పెళ్లిచూపులు షో తెరకెక్కింది. ఈ షోలో విజేతగా నిలిచిన అమ్మాయిని ప్రదీప్ పెళ్లి చేసుకుంటాడని ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రచారం నిజం కాలేదు. జీ తెలుగు ఛానల్ లో సూపర్ క్వీన్ సీజన్ 2 పేరుతో ఒక షో ప్రచారం అవుతోంది.

ఈ షో ప్రోమోలో అప్ప‌ట్లో స్వయంవరం అనే షో చేసావ్ అలాంటిదేనా ఇది కూడా అని అడగారు. అలాంటిదేమి లేద‌ని.. ఆ షో ఎప్పుడో మొత్తం అయిపోయింద‌ని కామెంట్ చేశాడు. హిడింబ టీమ్ ఈ షోకి వచ్చి ఎంటర్టైన్మెంట్ చేశారు. సీరియల్ నటి లిఖిత ఈ షోలో ఏమన్నావో ? ఏం విన్నావో సాంగ్ పాడడంతో పాటు కన్నా నీకోసమే అంటూ తన భర్త పై ప్రేమ వ‌లకపోసింది.

ఆ తర్వాత ఒక సీరియల్ నటి ఎంట్రీ ఇచ్చి నా తరపు నుంచి ప్రదీప్‌కు చిన్న బహుమతి అని చెప్పగా అన్నకు కాబోయే వదిన అంటూ ప్రదీప్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రదీప్ పెళ్లి శుభవార్త చెప్పాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రదీప్ కు రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు దక్కాలని కెరియర్ పరంగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ప్రదీప్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రదీప్ కు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఒక రేంజ్‌లో ఉంది.