మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ తన చెలి, స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. ఐదారేళ్ల ప్రేమ ఎట్టకేలకు ఫలించనుంది. వీరిద్దరు భార్య భర్తలు అవుతున్నారు. లావణ్య కూడా లక్ చిక్కి మెగా ఇంటి కోడలు అవుతోంది. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఈ టైంలో వరుణ్ అనవసరంగా రెండు రాంగ్ స్టెప్పులతో తన కెరీర్‌ను చేజేతులా నాశనం చేసుకోబోతున్నాడా ? అన్న చర్చలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
సహజంగానే ఎవరైనా సూపర్ హిట్ కాంబినేషన్లో సినిమా కోరుకుంటారు. లిస్ట్ లో హిట్ డైరక్టర్ ఉంటే ఆ ప్రాజెక్టు వెయిట్ , ఆ హీరో క్రేజ్ పెరుగుతుంది. సక్సెస్ ఓ సెంటిమెంట్‌గా ఇండస్ట్రీలో ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఓ వైపు పెళ్లి చేసుకుని హ్యాపీ లైఫ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతోన్న వరుణ్ తేజ్ మాత్రం ఫ్లాప్ ఇచ్చిన దర్శకులతోనే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుండడం ఎవ్వరికి నచ్చడం లేదు.
పైగా వరుణ్ మంచి హిట్లతో కెరీర్‌లోనే ఫామ్‌లో ఉన్నాడు. ఈ టైంలో ప్రస్తుతం గాండీవధారి అర్జున చేస్తున్నాడు. ఈ సినిమా దర్శకుడు ప్రవీణ్ సత్తారు నాగార్జునకు ది ఘోస్ట్ రూపంలో ఫ్లాప్ ఇచ్చాడు. ఈ లిస్ట్ లో ఇంకో డైరక్టర్ కూడా వచ్చి చేరాడు. అతడే కరుణ కుమార్.. త్వరలోనే కరుణకుమార్ తో కొత్త సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు. ఈ వారమే ఓపెనింగ్ అంటున్నారు.
కరుణకుమార్ రీసెంట్‌గా శ్రీదేవి సోడా సెంటర్ రూపంలో పెద్ద ఫ్లాప్ ఇచ్చాడు. ఆ తర్వాత అతడు తీసిన కళాపురం అరివీర భయంకరమైన డిజాస్టర్. ఇలాంటి దర్శకులకు వరుణ్‌తేజ్ అవకాశం ఇవ్వడం అసలు మెగాభిమానులకే కాదు.. సగటు సినీ అభిమానులకు కూడా ఏ మాత్రం మింగుడు పడడం లేదు. ఎంత కంటెంట్‌ను నమ్ముకున్నా ఇలాంటి దర్శకులతో.. అది కూడా ఈ టైంలో ఛాన్స్ ఇవ్వడం ఏంట్రా ? అని సినీ వర్గాలు తలలు పట్టుకుంటున్నాయి.