‘ ఆదిపురుష్ ‘ క్లోజింగ్ క‌లెక్ష‌న్లు.. రు. 150 కోట్లు లాభం.. ఇది ప్ర‌భాస్ రాజు స్టామినా..!

టాలీవుడ్ యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తోన్న వ‌రుస పాన్ ఇండియా సినిమాల ప‌రంప‌ర‌లో ఆదిపురుష్ సినిమా కూడా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. రామాయ‌ణ ఇతిహాసాన్ని ఆధారంగా చేసుకుని బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ఈ సినిమాను తెర‌కెక్కించారు. కృతిస‌న‌న్ సీత‌గా, బాలీవుడ్ క్రేజీ హీరో సైఫ్ ఆలీఖాన్ రావ‌ణుడు లంకేశ్ పాత్ర‌లో న‌టించారు.

ఇక ఈ సినిమా థియేట‌ర్ల‌లో మిశ్ర‌మ స్పంద‌న తెచ్చుకుంది. రామ‌య‌ణాన్ని స‌రిగా తెర‌కెక్కించ లేద‌న్న విమ‌ర్శ‌లు అయితే వ‌చ్చాయి. తాజాగా ఈ సినిమా థియేట్రిక‌ల్ ర‌న్ ముగిసింది. సినిమాకు టాక్‌తో సంబంధం లేకుండా నిర్మాత‌కు ఏకంగా రు. 150 కోట్ల లాభాలు వ‌చ్చాయి. ఏదేమైనా ప్ర‌భాస్ రేంజ్‌, క్రేజ్ సినిమాతో సంబంధం లేకుండా ఎలా ఉందో ఈ సినిమాకు వ‌చ్చిన లాభాలే చెపుతాయి.

ఆదిపురుష్ సినిమాకు టోట‌ల్‌గా రు. 450 కోట్ల బ‌డ్జెట్ అయ్యింది. టోట‌ల్ థియేట్రిక‌ల్ ర‌న్ ద్వారా రు. 330 కోట్ల షేర్ వ‌చ్చింది. ఇక నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ ద్వారా రు. 247 కోట్లు వ‌చ్చాయి. ఇందులో రు. 15 – 20 కోట్ల రేంజ్‌లో ఆడియో రైట్స్ కూడా ఉన్నాయి. ఓవ‌రాల్‌గా నిర్మాత‌కు రు. 150 + కోట్ల లాభాలు అయితే ద‌క్కాయి.

ఏదేమైనా ప్ర‌భాస్ సాహో సినిమా ప్లాప్ అయినా కూడా బాలీవుడ్‌లో ఏకంగా రు. 150 కోట్లు కొల్ల‌గొట్టింది. ఇప్పుడు ఆదిపురుష్ సినిమా కూడా అదే రేంజ్‌లో వ‌సూళ్లు రాబ‌ట్టింది. రేపు స‌లార్‌, ప్రాజెక్ట్ కే సినిమాల‌తో ప్ర‌భాస్ బాలీవుడ్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద విధ్వంస‌మే క్రియేట్ చేయ‌బోతున్నాడ‌ని క్లారిటీ వ‌చ్చేసింది.