రామ్‌చ‌ర‌ణ్ చేసిన ప‌నికి లాగిపెట్టి చెంప‌మీద కొట్టిన ఉపాస‌న‌.. అంత కోపానికి కార‌ణం ఇదే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి సిని బ్యాక్ గ్రౌండ్‌తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించిన చెర్రీ అపోలో సంస్థల అధినేత ఉపాసనను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం లైఫ్‌ హ్యాపీగా గడుపుతున్నాడు.

పెళ్లైన 11 ఏళ్లకు ఇటీవల ఒక ఆడపిల్లకు జన్మనిచ్చారు ఈ జంట. ప్రస్తుతం ఆ పాపను చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల రామ్ చరణ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను వివరించాడు. ఎప్పుడూ తన పర్సనల్ విషయాలను బయటకు తీసుకురాని రామ్ చరణ్ మొట్టమొదటిసారి తన భార్య ఉపాసనకి ఓ విషయంలో నాపై కోపం వచ్చిందని ఆమె నన్ను చంపమీద‌క లాగిపెట్టి కొట్టింది అంటు అభిమానులతో పంచుకున్నాడు.

రామ్ చరణ్ మాట్లాడుతూ అమ్మాయిలకు గిఫ్ట్ ఇవ్వడం చాలా కష్టమైన పని.. ఓసారి పెళ్లైన కొత్తలో ఉపాసనకు గిఫ్ట్ ఇవ్వాలని సర్ప్రైజ్ చేద్దామని ఏకంగా అయిదారు గంటలు వెతికి మరి చాలా డబ్బు పోసి ఒక కాస్ట్‌లీ గిఫ్ట్ కొన్నాడ‌ట‌. ఆ గిఫ్ట్ చూసిన తర్వాత ఉపాసన చాలా సంతోషంగా ఫీల్ అవుతుందని నేను అనుకున్నాను కానీ ఉపాసన మాత్రం ఆ గిఫ్ట్ చూసిన తరువాత సంతోషం లేకపోగా నన్ను కొట్టింది అంటూ కామెంట్ చేశాడు రామ్ చరణ్.

అప్పుడే నాకు అర్థమైంది అమ్మాయికి గిఫ్ట్ కొనాలి అంటే వాళ్లనే తీసుకుని వెళ్లి కొనాలి కానీ.. మనం సర్ప్రైజ్డ్ ప్లాన్ చేయకూడదని ఆ గిఫ్ట్ నచ్చక ఏకంగా ఉపాసన నన్ను చంప మీద కొట్టిందని గ‌త అనుభ‌వాలు నెమ‌ర‌వేసుకున్నాడు. ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవడంతో ఇంతకీ చెర్రీ ఉపాసనకు మండిపోయేలా ఏం గిఫ్ట్ ? ఇచ్చి ఉంటాడ‌నే ఆలోచనలో పడిపోయారు అభిమానులు.