‘ మెహబూబా ‘ సినిమా తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది నేహా శెట్టి. మొదటి సినిమా అంతగా హిట్ కాకపోయినా మంచి గుర్తింపు తెచ్చుకున్న నేహా తర్వాత కొన్ని సినిమాల్లో నటించింది. ‘ డిజె టిల్లు ‘ సినిమాతో ఫస్ట్ హిట్ తన ఖాతాలో వేసుకున్న నేహా మంచి పాపులారిటి సంపాదించుకుంది. సిద్దు జొన్నలగడ్డకు జంటగా ఈ సినిమాలో నెగిటివ్ రోల్ ప్లే చేసింది నేహా శెట్టి. ఈ సినిమాలో తన నటనతో అదరగొట్టిన నేహా ప్రస్తుతం మరో రెండు సినిమా షూటింగ్లలో బిజీగా గడుపుతుంది.
కార్తికేయ హీరోగా ‘ బెదురులంక 2012 ‘ అనే సినిమాలో నేహా శెట్టి నటిస్తుంది. దీంతో పాటు ‘ రూల్స్ రంజన్ ‘ అనే సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన నటిస్తోంది. ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక ఇటీవల నేహా శెట్టి సోషల్ మీడియా వేదికగా ఫాన్స్ తో ముచ్చట్టించింది. ఫాన్స్ తో మాట్లాడుతూ వారు అడిగిన ప్రశ్నలకు చాలా ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది. ఈ చాటింగ్ లో భాగంగా అభిమాని మీ ఫేవరెట్ ప్లేస్ ఏది అని అడగగా నేహా శెట్టి న్యూయార్క్ అని సమాధానం చెప్పింది.
అలాగే మీకు ఏ ఏ భాషలు వచ్చు అని ఫ్యాన్స్ ప్రశ్నించగా తెలుగు, తమిళ్, తులు, కన్నడ, ఇంగ్లీష్, హిందీ భాషల్లో మాట్లాడగలనని సమాధానం చెప్పింది. ఇదే క్రమంలో ఓ నెటిజన్స్ మీరు ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకోబోతున్నారు అంటూ ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చింది నేహా శెట్టి. ఏ మీకు నేను అప్పుడే బోర్ కొట్టేశానా అంటూ నేహా రిప్లై ఇవ్వడంతో ప్రస్తుతం ఈ కాన్వర్జేషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.