‘ మగధీర ‘ లాంటి సూపర్ హిట్‌ని మిస్ చేసుకున్న ఆ హీరో ఎవరో తెలుసా..?

మెగాస్టార్ నట వార‌సుడిగా రామ్ చరణ్ చిరుత సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. రామ్ చరణ్ నటించిన మొదటి సినిమా ఊహించిన రేంజ్ లో సక్సెస్ కాలేదు. కాని తర్వాత రాజమౌళి డైరెక్షన్‌లో కాజల్ హీరోయిన్‌గా, రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన మగధీర సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.

రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ తో వర్క్ చేసే అవకాశం దొరికిందని రామ్ చరణ్ ఆ సినిమాకి టక్కున ఓకే చేయడం.. అప్పటివరకు పెద్దగా మార్కెట్ లేని చరణ్ నమ్మి అల్లు అరవింద్ కోట్లు పెట్టి ప్రొడ్యూస్ చేయడం తో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఈ సినిమా రిలీజైంది.

ఇక ఈ సినిమా అప్పట్లోనే రూ.80 కోట్ల వసూళ్లను కొల్లగొట్టింది. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన కాజల్ అగర్వాల్ ఆ తరువాత ఎంత క్రేజ్‌ని సంపాదించుకుందో తెలిసిందే. రామ్ చరణ్ , కాజల్ ఇద్దరి కెరీర్‌ని ఈ సినిమాతో మంచి మలుపు తిరిగింది అని చెప్పాలి. ఈ సినిమాలో ముందుగా రాజమౌళి – ప్రభాస్ ని హీరోగా అనుకున్నాడట. ప్రభాస్ స్టోరీ నచ్చినప్పటికీ వేరే సినిమాల్లో బిజీగా ఉండడంతో ఈ సినిమాను వదులుకున్నాడు. రామ్ చరణ్ ఈ సినిమాను నటించి సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకోవడంతో ప్రభాస్ ఆ త‌ర్వాత చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడట.