ఓ సినిమా సక్సెస్ అవ్వాలంటే సినిమాలోని కంటెంట్ తో పాటు సినిమాకి తగ్గ మ్యూజిక్ కూడా ఎంతో అవసరం. సినిమా హిట్ అయ్యిందంటే ఆ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ క్రెడిట్ కూడా ఉంటుంది. ఒక్కోసారి సినిమాలో కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా ఆ సినిమాలో మ్యూజిక్ పాటలకు ప్రేక్షకులు కనెక్ట్ అవ్వడంతో సినిమా హిట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకునే విషయంలో డైరెక్టర్స్ కూడా ఎంతో ఆచితూచి అడుగులు వేస్తారు. మ్యూజిక్ డైరెక్టర్ అడిగిన రమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా వెనకాడరు. అలా ప్రస్తుతం హైయస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు ఒకసారి చూద్దాం.
ఏఆర్ రెహమాన్ :
టాలీవుడ్ – కొలీవుడ్ తేడా లేకుండా ఇప్పటికీ ఎన్నో సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా అద్భుతమైన సంగీతాన్ని అందించిన ఏ ఆర్ రెహమాన్ మూవీ బడ్జెట్‌ని బట్టి దాదాపు రూ.8 నుంచి రూ.10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తాడట.
అనిరుద్ :
ఇండస్ట్రీలో మంచి మ్యూజిక్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అనిరుద్ పాటలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా మ్యూజికల్ గా హిట్ అవుతుంది. అనిరుద్ కూడా సినిమా బడ్జెట్ ఆధారంగానే రూ.5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటాడట.
ఎం ఎం కీరవాణి :
ఏ ఆర్ రెహమాన్ తర్వాత అంతే కాలిబర్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి మాత్రమే. రాజమౌళి తరకెక్కించిన పాన్ ఇండియా రేంజ్ సినిమాలతో పాటు పెళ్లి సందడి లాంటి చిన్న చిన్న సినిమాలకు సైతం మంచి సంగీతం అందించి హిట్ అందించాడు. కీరవాణి కూడా ఒక్కో సినిమాకు దాదాపు రూ.5 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటాడట.
థమన్ :
సౌత్ ఇండియా టాప్ మ్యూజిక్ డైరెక్టర్ లో ఎస్ ఎస్ థమన్ ఒకడు. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకున్న థమన్ ఒక్కో సినిమాకు రూ.3 నుంచి రూ.5 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటాడట.
దేవిశ్రీప్రసాద్ :
ఒకప్పుడు టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకుని దేవిశ్రీప్రసాద్ మధ్యలో డల్ అయినప్పటికీ మళ్ళీ పాన్ ఇండియా మూవి పుష్ప సినిమాతో ఫామ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం డిఎస్పి ఒక సినిమాకి రూ.3 నుంచి రూ.5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట.