చంట‌బ్బాయ్ సినిమా టైంలో కృష్ణ VS చిరంజీవి మాట‌ల తూటాలు… రంగంలోకి దాస‌రి..!

మెగాస్టార్ చిరంజీవి చాలా క‌ష్ట‌ప‌డి సినిమా రంగంలోకి వ‌చ్చారు. ఆయ‌న ఒక్క‌రేకాదు.. హీరో కృష్ణ‌కూడా తొలినాళ్ల‌లో ఇంత‌క న్నా ఎక్కువ‌గానే క‌ష్ట‌ప‌డ్డార‌ని తెలిసివారు చెబుతారు. ఈ ఇద్ద‌రు హీరోల‌కు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదు. అంటే.. వారి కుటుంబాల నుంచి ఎవ‌రూ సినిమా ఫీల్డ్‌లో లేరు. అయినా.. కూడా వీరు సినిమా రంగంలో ఒక ప్ర‌త్యేక‌త‌ను సాధించ‌డానికి కార‌ణం.. స్వ‌యం కృషే అన‌డంలో ఎలాంటి సందేహం లేదని వారి అభిమానులు.. సినీ విమ‌ర్శ‌కులు కూడా చెబుతారు. ఇది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే.

అయితే.. చిరంజీవికి, కృష్ణ‌కు మ‌ధ్య చాలా వ్య‌త్యాసం ఉండేది. కృష్ణ చాలా రెబ‌ల్‌గా ఉండేవారు. పోటీ వాతావ‌ర‌ణం అంటే ఆయ‌న కు చాలా ఇష్టం. దీంతో ఎవ‌రైనా కొత్త ప్ర‌యోగాలు చేస్తే.. తాను ముందుండాల‌ని భావించేవారు. ఇలా.. అన్న‌గారు ఎన్టీఆర్‌కు, అక్కినేని నాగేశ్వ‌ర‌రావుకు పోటీగా సినిమా రంగంలో హీరో కృష్ణ అనేక‌ప్ర‌యోగాలు చేశారు. అన్న‌గారు ఆరాధ‌న సినిమా చేస్తే.. అదేటైటిల్‌ను కొని కృష్ణ కూడా సినిమాలు చేశారు.

అలాగే.. అన్న‌గారు కృష్ణావ‌తారం సినిమా తీస్తే.. తాను కూడా రెడీ అన్నారు. ఇక్క‌డ లాభ‌న‌ష్టాల‌తో ప‌నిలేకుండా.. త‌న అభిమానులుకొరుకున్నారు.. తాను కూడా చేయాల‌నే క‌న్సెప్టును కృష్ణ పాటించేవారు.
ఇదే ప‌రంప‌రంలో మెగాస్టార్ చిరంజీవి కూడా కృష్ణ పోటీ ఇవ్వాల‌ని.. అవ్వాల‌ని చూశారు. జంధ్యాల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన చంట‌బ్బాయ్ సినిమా త‌ర్వాత‌.. త‌ను కూడా అలాంటి రోల్స్ చేయాల‌ని కృష్ణ తాపత్ర‌య‌ప‌డ్డారు. నిజానికిచిరు చేసింది పెద్ద ప్ర‌యోగం అని అప్ప‌ట్లో టాక్ ఉండేది.

మంచి ఫామ్‌లో ఉన్న‌ప్పుడు. ఇలాంటి పాత్ర‌లు వేయ‌డం చిరుకు ఇబ్బంది అని అనిపించినా.. అప్ప‌టికే జంధ్యాల‌కు ఆయ‌న మాటిచ్చి ఉండ‌డంతో కాద‌న‌లేక పోయారు. అయితే.. దీనికి పోటీగా కృష్ణ `పెద్ద‌బ్బాయ్‌` అనే టైటిల్‌తో సినిమా చేయాల‌ని ఉత్సాహం చూపించారు. అయితే.. దీనిపై జ‌రిగిన చ‌ర్చ‌ల్లో దాస‌రి నారాయ‌ణ‌రావు జోక్యం చేసుకుని అలా వ‌ద్ద‌ని సూచించారు. దీంతో ఆ ప్రాజెక్టును ఆపేశారు.

ఇక‌, ఇదే విష‌యం చిరు ద‌గ్గ‌ర కూడా చ‌ర్చ‌కు వ‌చ్చింది. మీకు పోటీగా కృష్ణ సినిమా తీయాల‌ని భావిస్తున్నార‌ని ఎవ‌రో ఆయ‌న చెవిలో ఊదారు. అయితే.. చిరు మాత్రం ఎవ‌రిష్టం వాళ్ల‌ది.. నేను ప‌రిగెట్టి పాలు తాగ‌లేను. అని క‌రాఖండీగా చెప్పారు. అందుకే.. హీరో కృష్ణ‌తో ఆయ‌న ఎక్క‌డా ఎప్పుడూ పోటీ ప‌డ‌లేదు. ఇద్ద‌రి మ‌ధ్య మంచి సంబంధాలు ఉండాల‌ని.. వాటిని ఒక‌టి రెండు సినిమాల కోసం పోగొట్టుకోకూడ‌ద‌ని చిరంజీవి చెప్పేవారు. అందుకే.. కృష్ణ ఇత‌ర నాయ‌కుల‌తో పోటీ ప‌డినా.. చిరుతో ఎప్పుడూ పోటీ ప‌డ‌లేదట‌.

ష్ట‌ప‌డ్డార‌ని తెలిసివారు చెబుతారు. ఈ ఇద్ద‌రు హీరోల‌కు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదు. అంటే.. వారి కుటుంబాల నుంచి ఎవ‌రూ సినిమా ఫీల్డ్‌లో లేరు. అయినా.. కూడా వీరు సినిమా రంగంలో ఒక ప్ర‌త్యేక‌త‌ను సాధించ‌డానికి కార‌ణం.. స్వ‌యం కృషే అన‌డంలో ఎలాంటి సందేహం లేదని వారి అభిమానులు.. సినీ విమ‌ర్శ‌కులు కూడా చెబుతారు. ఇది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే.