స‌మంత క్రేజ్ ఏ మాత్రం తగ్గ‌లేదు… ఇండియాలోనే నెంబ‌ర్ 1 హీరోయిన్‌..!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి దశాబ్దం దాటినా ఇంకా అదే క్రేజ్ తో ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. నాగ‌చైత‌న్య‌ను పెళ్లి చేసుకుంది.. నాలుగేళ్లు కాపురం చేసి విడాకులు ఇచ్చేసింది. ఆ త‌ర్వాత కూడా సినిమాల్లోకి వ‌చ్చి హాట్‌గా రెచ్చి పోతోందంటే ఆమె క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని చెప్పాలి.
టాలీవుడ్ స్టార్ హీరోల అందరి సరసన నటించి ఎన్నో సూప‌ర్ హిట్లు కొట్టిన స‌మంత ఇప్పుడు చిన్న హీరోలు, మిడిల్ రేంజ్ హీరోల సినిమాల‌కైనా ఓకే చెప్పేస్తోంది.

సమంత ఇటీవల విజయ్ దేవరకొండ హీరోగా ఖుషి సినిమాలో నటించింది. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్త‌య్యింది. దీంతో పాటు బాలీవుడ్ లో కూడా అవకాశాలను దక్కించుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల సమంత సిటాడల్ బాలీవుడ్ వెబ్ సిరీస్ లో షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం తన అనారోగ్య సమస్యలతో సినిమాలకు సంవత్సరం పాటు సెలవు తీసుకుంది.

ఇప్పటికే స్టార్ హీరోయిన్గా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్న సమంత మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇటీవ‌ల సినిమా ఛాన్సులు స‌రిగా లేక‌పోయినా కూడా త‌న క్రేజ్ త‌గ్గ‌లేద‌ని ఫ్రూవ్ చేసుకుంది. ప్రతి నెలా స్టార్ ఇండియా మనదేశంలో స్టార్ హీరోయిన్ ఎవరు ? అనే దానిపై సర్వే నిర్వహిస్తుంది.

అలా తాజాగా నిర్వహించిన సర్వేలో గ‌త నెల‌కు మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్ యాక్టర్ గా సమంత మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ తీసుకుని ఫ్యాన్స్ షాక్ ఇచ్చింది సమంత. అయినా కూడా సమంత మోస్ట్ పాపులర్ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకోవడం ఫాన్స్ కు మంచి ఊరట.