లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అలాంటి విజయశాంతి అప్పట్లో హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకొని స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. ప్రతిఘటన, కర్త్యవం సినిమాలో ఆమె ఇమేజ్‌ను స్టార్ హీరోలతో సమానంగా తీసుకెళ్లి కూర్చోపెట్టాయి. గఇంకా ఈ హీరోయిన్ చాలా మంది హీరోలతో జతకట్టి ఎన్నో సినిమాల్లో నటించింది.
విజయశాంతి శ్రీనివాస్ ప్రసాద్ ని వివాహం చేసుకున్న తర్వాత కూడా మరో హీరోని పెళ్లి చేసుకోవాలనుకుందన్న గుసగుసలు గతంలో వినిపించాయి. మరి విజయశాంతి నిజంగానే రెండో పెళ్లి చేసుకోవాలనుకుందా ? ఆ రెండో పెళ్లి చేసుకోవాలనుకున్న స్టార్ హీరో ఎవరు ఏంటన్నది అప్పట్లో సెన్షేషన్. విజయశాంతి – నందమూరి నటసింహం బాలకృష్ణ కాంబినేషన్లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు వచ్చాయి.
అయితే వీరిద్దరి మధ్య సాన్నిహితం చూసిన చాలామంది సిని ఇండస్ట్రీ జనాలు వీరిద్దరి మధ్య ఏదో సంథింగ్ సంథింగ్ జరుగుతుందన్న అపోహతో ఉండేవారు. ఈ టైప్ వార్తలు కూడా వీరిపై వచ్చాయి. అంతేకాదు త్వరలోనే విజయశాంతి, బాలకృష్ణ పెళ్లి చేసుకుంటారని.. వీరు తమ జీవిత భాగస్వాములకు కూడా విడాకులు ఇచ్చేస్తారన్న పేద్ద పుకార్లు అప్పట్లో బాగా నడిచేవి.
అయితే ఈ వార్తలు గురించి సీనియర్ జర్నలిస్ట్, సినీ విశ్లేషకులు ఈమంది రామారావు నిజం ఏంటన్నది
తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ.. విజయశాంతి, బాలకృష్ణ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చిన మాట నిజమే… కానీ అది కేవలం వారి మధ్య ఉన్న అనుబంధాన్ని చూసి కొంతమంది జర్నలిస్టులు అలా రాశారని.. ఈ పుకార్లలో నిజం లేదని చెప్పారు. వారిద్దరు మంచి స్నేహితులు అని ఆయన చెప్పారు.