ఇండస్ట్రీలో కొన్నిసార్లు అట్టర్ ప్లాప్ అవ్వాల్సిన సినిమాలు లక్ కలిసి రావడంతోనో, హీరోకి ఉన్న క్రేజ్ వల్ల సూపర్ హిట్స్ గా నిలిచాయి. అలాంటి సందర్భం ఒకటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ విషయంలో కూడా జరిగింది. ఎన్టీఆర్ హీరోగా నటించిన దమ్ము సినిమా మొదటిరోజు మొదటి ఆట నుంచి ప్లాప్ టాక్ తెచ్చుకున్న కేవలం పవన్ కళ్యాణ్ కారణంగానే అబో యావరేజ్ గా నిలిచింది. అదేలా..? అంటే ఎన్టీఆర్ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘ దమ్ము ‘ సినిమా ‘ సింహా ‘ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత తెరకెక్కడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ రిలీజై మంచి రెస్పాన్స్ సంపాదించడంతో రిలీజ్‌కి ముందే ఈ సినిమాపై హైప్ పెరిగింది. దీంతో సినిమా ఓపెనింగ్ కలెక్షన్లు బానే రాబట్టింది. అప్పట్లో ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఆల్ టైం రికార్డ్ గా నిలిచాయి. తర్వాత రోజు నుంచి నెమ్మదిగా వసూళ్లు తగ్గిపోతూ వచ్చాయి. సినిమా రిలీజ్ అయిన రెండు వారాలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ గబ్బర్ సింగ్ ‘ సినిమా రిలీజ్ అయింది.
ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ లో ? దుమ్ము రేపిందో తెలిసిందే. అప్పటివరకు సరైన హిట్ లేకుండా ఇబ్బంది పడుతున్న పవన్ కళ్యాణ్ కెరీర్‌కు మంచి ఊపు ఇచ్చింది. పదేళ్ల తర్వాత పవన్‌కు ఈ సినిమాతో మంచి హిట్ దక్కింది. ఈ సినిమాకి వచ్చిన వసూలు కేవలం ‘ గబ్బర్ సింగ్ ‘ నిర్మాతకు మాత్రమే కాకుండా ‘ దమ్ము ‘ సినిమా నిర్మాతకు కూడా బాగా కలిసి వచ్చాయి.
గబ్బర్‌సింగ్ సినిమాకి సుమారుగా 50 రోజులు వరకు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో హౌస్ ఫుల్ అయ్యాయి. ఇక ‘ గబ్బర్ సింగ్ ‘ మూవి టికెట్స్ దొరకని వారంతా పక్క థియేటర్స్ లో ఉన్న ‘ దమ్ము ‘ సినిమాకు వెళ్లి ఆ సినిమాను ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా కాంప్లెక్స్ థియేటర్స్ లో గబ్బర్ సింగ్ సినిమా వల్లే దమ్ము సినిమా బాగా లాభపడింది. అలా గబ్బర్ సింగ్ కారణంగా దమ్ము సినిమా మరో రెండు వారాలు ఎక్కువగా ఆడింది. రూ.35 కోట్ల వరకు కలెక్షన్స్ వసూలు చేసింది.