ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర మరో ప్రైడ్ థింగ్ గా మారిన భారీ సినిమా “కల్కి 2898ఏడి”. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాల పరంపరలో సలార్ తర్వాత వస్తోన్న సినిమా ఇది. ప్రభాస్ – దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ హాలీవుడ్ సినిమాల స్టైల్లో ఉంది.
తాజాగా రిలీజ్ అయిన గ్లింప్స్ చూస్తుంటే మాత్రం మతులు పోయేలా ఉంది. గ్లింప్స్‌తోనే ఒక్కసారిగా అందరినీ ఎగ్జైట్ చేసిన ఈ సినిమాపై టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్. రాజమౌళి కూడా తన ఆసక్తిని చూపిస్తూ
సినిమాపై ప్రశంసల వర్షం కురిపించేశారు. అసలు భవిష్యత్తు నేపథ్యంలో సినిమాలు తీయడం అసాధ్యం.. దానినే మీరు సుసాధ్యం చేశారంటూ కల్కి టీంను మెచ్చుకున్నారు.
అయితే చివర్లో ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటూ పోస్ట్ చేయడం ఫ్యాన్స్ లో మంచి ఫన్ థింగ్ అయ్యింది. రాజమౌళి సినిమాలకి రిలీజ్ డేట్లు ఎన్నిసార్లు మారతాయో చెప్పక్కర్లేదు. అలాంటి రాజమౌళి ఈ కల్కి రిలీజ్‌డేట్ ఎప్పుడు ? అని ప్రశ్నించడంతో చాలా మంది రాజమౌళిని సరదాగా ట్రోల్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే రాజమౌళి ఈ సినిమా రిలీజ్ డేట్ అడగడంపై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ కూడా సరదాగా కౌంటర్ రిప్లే ఇచ్చారు. “రిలీజ్ డేట్ కోసం ఎవరు అడుగుతున్నారో చూడండి” అని నవ్వుతూ రిప్లై ఇచ్చారు. దీనితో ఇది సోషల్ మీడియాలో కాస్త ఎంటర్టైనర్‌గా మారింది.