టాలీవుడ్ లో లెజెండ్రీ యాక్టర్ అనగానే మనకు ఠక్కున గుర్తుకు వచ్చేది ఎన్టీఆర్. పౌరాణిక సినిమాల్లో అత్యధిక పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న ఎన్టీఆర్ కోట్లాదిమంది హృదయాలలో అభిమాన నటుడిగా గుర్తుండిపోయాడు. నటుడిగానే కాక దర్శకుడు , నిర్మాతగా కూడా ఎన్టీఆర్ సక్సెస్ అయ్యారు. అసలు సినిమా రంగంలో ఆయనకు పట్టులేని రంగం ఉండేదే కాదు.
ఎన్టీఆర్ తెలుగువారి మదిలో యుగపురుషుడిగా ఎవరు మెప్పించలేనని పాత్రలలో చేసి మెప్పించాడు. కానీ ఎన్టీఆర్ కూడా రాముడు, రావణాసురుడు పాత్రల్లో అదరగొట్టేశాడు. ఎప్పుడు ? హనుమంతుడు పాత్రను పోషించలేదు. కన్నడ రాష్ట్రానికి కూడా ఒక యుగపురుషుడు ఉన్నాడు. అతనే కన్నడ కంఠరవ రాజ్ కుమార్. ఎన్టీఆర్‌కి రాజ్‌కుమార్ సమకాలిక నటుడు అనడంలో సందేహం లేదు.
ఎన్టీఆర్‌తో దీటుగా నటించగల సత్తా ఉన్న నటుడు రాజ్ కుమార్. ఎన్టీఆర్ కూడా చేయలేని ఒక అద్భుతమైన క్యారెక్టర్ లో నటించాడు రాజ్ కుమార్. రాముడిగా రావణుడిగా కాకుండా హనుమంతుడిగా కూడా నటించి భారతదేశంలోనే ఏ హీరోకి లేని రికార్డ్ సొంతం చేసుకున్నాడు. రాముడిగా సౌమ్యుడుగా ఉండడం, రావణుడిగా భీకరంగా నటించడం, హనుమంతుడిలా పరమ భక్తుడిగా నటించడం కేవలం రాజ్ కుమార్ కు మాత్రమే సాధ్యమైంది.
ఇక రాజ్ కుమార్ గొప్పతనం గురించి చెప్పాలంటే ఆయన బిరుదుల లిస్ట్ చెప్తే సరిపోతుంది. అతని వారసులు కూడా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. శివరాజ్ కుమార్ మరియు అప్పు.. అలియాస్ పునీత్ రాజ్ కుమార్. కొంతకాలం క్రితం పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఎన్నో మంచి పనులు చేసి అభిమానుల హృదయాలలో ముద్ర వేసుకున్న పునీత్ రాజ్ కుమార్ మరణించడంతో అప్పట్లో కన్నడ ఇండస్ట్రీ కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. ఇక వ్యక్తిగతంగా కూడా ఈ రెండు కుటుంబాల వారసులు ఎంతో సన్నిహితంగా ఉంటారు.