సినిమా ఇండస్ట్రీలో కొన్ని వార్తలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ప్రూఫ్ లేకపోయినప్పటికీ అవి ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ సంపాదిస్తాయి. అలా తాజాగా ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ రెండో భాగంలో టాలీవుడ్ రౌడీ హీరో విజయ దేవరకొండ నటించబోతున్నాడంటూ ఓ వార్త ప్రచారం జరుగుతుంది.
ఈ వార్త అలా బయటకు వచ్చిందో లేదో సోషల్ మీడియాను అయితే పిచ్చపిచ్చగా షేక్ చేసి పడేస్తోంది. కొంత కాలంగా ఖుషి సినిమా షూటింగ్‌లో పాల్గొన్న విజయ్ దేవరకొండ రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాడు. అయితే మరి ఈ రూమర్ ఎందుకు వచ్చిందన్నది మరో ట్విస్ట్. ఖుషి షూటింగ్ టైం గ్యాప్‌లో ముంబైకి వెళ్ళి యాడ్ షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ట్రెండ్ అయింది.
ఇదే క్రమంలో ఆ యాడ్ షూట్ లొకేషన్ లో దిగిన విజయ్ ఫోటోలు చూసి సలార్ సినిమాలో విజయ్ దేవరకొండ నటించబోతున్నాడంటూ రూమర్లు క్రియేట్ చేస్తున్నారు కొందరు గాసిప్ రాయుళ్లు. వాస్తవానికి సలార్‌లో ప్రభాస్ లుక్, విజయ్ దేవరకొండ దిగిన ఆ ఫోటోల లుక్‌కి పోలికలేమి ఉండవు. అయితే రగ్డ్ స్టైల్లో విజయ్ కనిపించాడు.
దీంతో విక్రమ్ సినిమాలో సూర్య రోలెక్స్ పాత్ర లాగా ఒక ఎక్స్‌ట్రార్డినరీ రోల్‌ని విజయ్ దేవరకొండ సలార్ 2లో ప్లే చేయబోతున్నాడని… విజయ్ రోల్ ఈ సినిమాకి లీడ్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక విజయ్ దేవరకొండ – సమంత కాంబినేష్లో రూపొందించిన ఖుషి సినిమా 1సెప్టెంబర్ 2023న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.