ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న తర్వాత స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు మాస్ మహారాజ రవితేజ. ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో రవితేజ ఎంతో మంది డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఈ విషయాన్ని స్వయంగా రవితేజనే కొన్ని సందర్భాల్లో చెప్పుకున్నాడు. రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్గా కృష్ణవంశీ, ఈవీపీ, రాఘవేంద్రరావు ఇలా ఎంతోమంది డైరెక్టర్స్ దగ్గర పనిచేశాడు.
అలాంటి రవితేజ ఈ రోజు స్టార్ హీరో కావడంతో పాటు మాస్‌లో తిరుగులేని మాస్ మహరాజ్ అయిపోయాడు. ప్రస్తుతం రవితేజ ఒక్కో సినిమాకు రు. 20 కోట్ల రేంజ్ రెమ్యునరేషన్ తీసుకునే స్థాయిలో ఉన్నాడు. అసలు ఏ మాత్రం గ్యాప్ లేకుండా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఇలా రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన సినిమాల్లో ఒక పవన్ కళ్యాణ్ సినిమా కూడా ఉందట.
ఆ సినిమా షూటింగ్ టైంలో ఎన్నో సన్నివేశాలను పవన్ కళ్యాణ్‌కు రవితేజనే వివరించడట. ఇంతకీ ఏంటా సినిమా అనుకుంటున్నారా. ఈవీవీ డైరెక్షన్‌లో పవన్ కళ్యాణ్ మొదటి సినిమా ‘ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ‘ ఈ సినిమా ఊహించినంత హిట్ అవ్వకపోయినా నటుడిగా పవన్ కళ్యాణ్‌కి మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమా షూటింగ్ టైంలో రవితేజకు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అవకాశాలు రావడంతో ఈ సినిమాను మధ్యలోనే వదిలిపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించాడు.
ఆ తర్వాత మెల్లగా హీరోగా అవకాశాలను దక్కించుకొని చిన్నచిన్న సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కొంతకాలం వరస ప్లాపులు ఎదురైనా సినిమాలలో నటిస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం ఎన్నో హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకుని స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు.