యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే సినిమాకు సంబంధించి ప్రతి అప్డేట్ ప్రభాస్ ఫ్యాన్స్ కి తెగ నచ్చేస్తుంది. ప్రాజెక్ట్ కే పోస్టర్ విషయంలో కొన్ని నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. ప్రభాస్ రేపు సినిమాతో వీటన్నింటికీ చెక్ పెట్టడం ఖాయమని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ కే స్టోరీ మెయిన్ లైన్ లీక్ అవ్వడం ఇప్పుడు సెన్షేషనల్‌గా మారింది.
ఈ సినిమాలో కమల్ రాక్షసుడుగా, ప్రభాస్ దేవుడిగా కనిపిస్తాడని తెలుస్తుంది. కలియుగం చివర్లో ఒక రాక్షసుడు రాక్షస పాలన సాగిస్తూ ఉంటాడని.. ఆ సమయంలో ప్రజల కష్టాలను తీర్చడానికి దేవుడిగా ప్రభాస్ ఎంట్రీ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ప్రాజెక్ట్ కే విడుదల తర్వాత కనివినీ ఎరుగని రేంజ్లో సంచలనాన్ని సృష్టిస్తుందని ఇండియన్ సినీ జనాలు భావిస్తున్నారు.
ఈ సినిమా స్టోరీ లైన్ రొటీన్ గా ఉన్న కథనం కొత్తగా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాలో గ్లింప్స్ తో ఈ సినిమా విషయంలో నెలకొన్న అనుమానాలు అన్ని పటాపంచలు అయిపోయాయి. పోస్టర్‌తో వచ్చిన నెగటివ్ టాక్‌ను గ్లింప్స్‌తో నాగ్ అశ్విన్ పటాపంచలు చేసిపడేశాడు. అసలు టీజర్ దెబ్బతోనే ఇండియన్ సినీ జనాల మైండ్ బ్లాక్ అయిపోయింది. రేపు థియేటర్లలో సినిమా చూస్తుంటే మనం ఖచ్చితంగా మరో ప్రపంచంలోకి వెళ్లినట్టు ఉంటుందంటున్నారు.
ఇక నాగ్ అశ్విన్ ఈ సినిమా ఖర్చు విషయంలో ఏమాత్రం తగ్గేదే అంటున్నాడట. ప్రాజెక్ట్ కే సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా నాగ్ అశ్విన్ ఈ సినిమాను ఎలా ? ప్లాన్ చేశారన్న ఉత్కంఠ గ్లింప్స్ వీడియో పెంచేసింది. టాప్ మోస్ట్ నటీనటులు నటించడంతో ఈ సినిమాపై ఈ స్థాయిలో అంచనాలు పెరిగాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రు. 600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ కల్కి పాన్ వరల్డ్ రేంజ్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని ప్రభాస్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.