ప్రస్తుతం సోషల్ మీడియాలో, కరెంట్ మీడియాలో ఎక్కడ చూసినా మహేష్ బాబు గారాల పట్టి సితారనే కనిపిస్తుంది. అద్భుతమైన ఫోటోలు, స్టిల్స్‌తో మెరుస్తుంది. ఆమె ఫొటోస్, వీడియోస్ ఎక్కడ కనిపించినా జనం వాటిని తెగ వైరల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఆమెకు తిరుగులేని ఫాలోయింగ్ వచ్చేసింది. దీని అంతటికి కారణం సితార ఇటీవల నటించిన ఒక జువెలరీ యాడ్.
హోమ్లీ లేడీస్ కూడా ఆ వీడియోను పదే పదే చూసుకుంటూ మెచ్చుకుంటూ మెరిసిపోతున్నారంటే ఆమె ఎంత అందంగా యాడ్‌లో నటించిందో.. ఎంత అందంగా కనిపించిందో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాగా ఎవరైనా సెలబ్రిటీల పిల్లలు పుట్టినరోజు వచ్చిందంటే ట్రిప్స్ కి వెళ్లాలని, ఎంజాయ్ చేయాలని, గ్రాండ్ గా పార్టీ సెలబ్రేట్ చేసుకోవాలని డబ్బులను జల్సాలకు తగలయ్యేలని అనుకుంటుంటారు.
కానీ సితార మాత్రం ఇతరులకు సాయం చేసే విషయంలో తన తండ్రిని మించిపోయింది. రీసెంట్గా సితార తన 11వ పుట్టినరోజు సందర్భంగా కొంతమంది పేద పిల్లలకు వారికి ఎంతో ఉపయోగకరంగా ఉండాలని ఉద్దేశంతో సైకిళ్లను పంచి పెట్టింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇంత చిన్న ఏజ్ లోనే ఇంత పెద్ద మనసు సితారకు ఎలా ? వచ్చింది గ్రేట్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక సితార జ్యూవెల్లరి యాడ్‌లో నటించడం ద్వారా వచ్చిన కోటి రూపాయలను కూడా ఛారిటీకు ఇచ్చేసినట్టు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. సితారది కూడా తన తండ్రిలాగే మంచి మనసున్న పాప… తండ్రిని మించిపోయి మరి ఈ వయసు నుంచే సాయాలు చేస్తోందని ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక మహేష్ కూడా శ్రీమంతుడు సినిమా తర్వాత ఏపీ, తెలంగాణలో రెండు గ్రామాలను దత్తత తీసుకుని డవలప్ చేయడంతో పాటు ఎంతో మంది చిన్నారులకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్లు చేయిస్తున్నారు.