నిహారిక షేర్ చేసిన ఫొటోపై విమ‌ర్శ‌లు… అందుకే చైతన్య వదిలేసాడంటూ ట్రోల్స్..?

మెగా డాటర్ నిహారిక ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. జొన్నలగడ్డ చైతన్య – నిహారిక విడాకులు తీసుకుంటున్నారు అంటూ మొదట్లో వార్తలు వినిపించాయి. ఇక వీరిద్దరు విడాకులు తీసుకున్నారంటు కన్ఫర్మ్ అయిన తర్వాత నిహారిక ఏది చేసినా దాన్ని తప్పుపడుతూ జనం ఆమెని తెగ ట్రోల్స్ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీలో పుట్టి పెరిగిన నిహారిక మెగా పరువు తీసిందంటూ.. ఆడేసుకుంటున్నారు.

పెళ్ల‌య్యాక సంసారం చేసుకోకుండా.. సంప్ర‌దాయంగా ఉండ‌క‌పోవ‌డంతోనే ఆమెను భ‌ర్త చైత‌న్య వ‌దిలేశాడ‌ని.. ఈ విష‌యంలో త‌ప్పంతా నిహారిక‌దే అనే వాళ్లే ఎక్కువ మంది క‌నిపిస్తున్నారు. తాజాగా నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్న ఒక పిక్ వైరల్ చేస్తూ నిహారికపై ఫైర్ అవుతున్నారు నెటిజన్స్. జొన్నలగడ్డ చైతన్య – నిహారిక విడాకులు తీసుకున్న తర్వాత నిహారిక తన గురించి వచ్చే ట్రోల్స్ ఏమాత్రం పట్టించుకోకుండా ఆమె పని ఆమె చేసుకుంటూ పోతుంది.

వెబ్ సిరీస్‌లో నటిస్తూ.. మరో పక్క తన ఫ్రెండ్స్‌తో టిప్స్ ఎంజాయ్ చేస్తూ.. హాట్ ఫోటో…ట్స్ తో కుర్రాళ్లను ఆకట్టుకుంటోంది. ఇలా తాజాగా నిహారిక తన స్టోరీలో తన క్లోజ్ ఫ్రెండ్ అయిన ఓ అమ్మాయిని టైట్ హాగ్ చేసుకుంటూ ఓ పిక్ షేర్ చేసింది. ఆ పిక్ కి పెళ్లి చేసుకోబోయే జంటలు ఫోటో షూట్ చేయించుకోవాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి అంటూ ట్యాగ్ చేసింది. దీంతో నిహారికపై కొంతమంది ట్రోల్స్ మొదలెట్టేశారు.

అమ్మాయికి రొమాంటిక్ హాగ్ ఇవ్వడమేంటి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ చెత్త టాగ్స్ పెట్టడం ఏంటి ? అదేదో చైతన్యతోనే అలా ఉండి ఉంటే విడాకులు తీసుకునే పరిస్థితి వచ్చేది కాదు కదా.. మెగా ఫ్యామిలీ పరువు తీయడానికి ఇలాంటి పనులు చేస్తున్నావా ? చైతన్య అందుకే నిన్ను వదిలేసాడేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా విడాకుల త‌ర్వాత నిహారిక ఎక్క‌డా త‌గ్గ‌కుండా రెచ్చిపోతున్న‌ట్టే ఉంది.