మహేష్‌బాబు అక్క ప్రొడ్యూసర్‌గా పవన్ కళ్యాణ్ కొత్త సినిమా.. డైరెక్టర్ ఎవరంటే..?

టాలీవుడ్‌లో ప్రతి జనరేషన్లో ఇద్దరు టాప్ టు హీరోస్ ఉంటారు ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నార్ ఆ తర్వాత కృష్ణ, శోభన్ బాబు ఆ తరువాత చిరంజీవి, బాలకృష్ణ ఇక ఇప్పుడు టాప్ 3 హీరోల‌లో ఎవరు అంటే వినిపించేది పవన్ కళ్యాణ్ – మహేష్ బాబు పేర్లే. టాలీవుడ్‌లో ఈ త‌రం జ‌న‌రేష‌న్ హీరోల్లో మంచి అంచ‌నాలు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమాలే ఉంటాయ‌ని ట్రేడ్ వ‌ర్గాలు న‌మ్ముతుంటాయి.

వీళ్లిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా వస్తే బాక్సాఫీస్ దగ్గర రికార్డ్స్ బ్రేక్ అవ్వాల్సిందే. కేవలం టాలీవుడ్ లోనే కాదు పాన్ ఇండియా రేంజ్ లో వీరిద్దరూ బాక్సాఫీస్‌ శాసిస్తారని వీళ్ళ అభిమానుల గట్టి నమ్మకం. ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్లో ఒక్క సినిమా కూడా రాలేదు. వీరిద్ద‌రు ఇటీవ‌ల‌ కనీసం కలిసి దిగిన ఫొటోస్ కూడా రాలేదు.

సూపర్ స్టార్ కృష్ణ చనిపోయినప్పుడు వీరిద్దరూ కలిసినా… అది బాధాకరమైన సంఘటన కాబట్టి అక్కడ ఫోటోలు దిగలేదు. ఫ్యాన్స్ కూడా వారిద్దరు అక్కడ కలిసినా ఆ మూమెంట్ ఫీల్‌ అవ్వలేకపోయారు. ఇక వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందో లేదో అనే విషయాన్ని పక్కన పెడితే మహేష్ బాబు అక్క మంజుల త్వరలోనే తన ప్రొడక్షన్ సంస్థ మళ్ళీ ప్రారంభించబోతుందట. గ‌తంలో ఆమె మ‌హేష్‌తో నాని, పోకిరి, నాగ‌చైత‌న్య‌తో ఏమాయ చేశావే లాంటి సినిమాలు నిర్మించింది.

పవన్ కళ్యాణ్ సినిమాతో ఈ బ్యానర్ పునః ప్రారంభించబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఇందిరా క్రియేషన్స్ బ్యానర్ పై ఒక సినిమా రానుంద‌ని టాక్ ? అయితే ఇదంతా జ‌రిగినా మ‌రో రెండేళ్ల త‌ర్వాతే కావొచ్చు. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌మిట్‌మెంట్లు ఎక్కువే ఉన్నాయి. ఆ త‌ర్వాత ఏపీ ఎన్నిక‌లు… త‌ర్వాత పాత క‌మిట్మెంట్లు అయ్యాకే మంజుల బ్యాన‌ర్లో సినిమా చేయొచ్చు.