‘ బ్రో ‘ టార్గెట్‌గా బ్యాడ్ ప్ర‌చారం.. తెర‌వెన‌క పెద్ద కుట్ర లేపుతోందెవ‌రు…?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – సాయి ధరంతేజ్ కాంబినేషన్లో తెరకెక్కిన బ్రో ది అవుతార్‌ మూవీ భారీ అంచనాలతో ఈ నెల 28న థియేటర్లలోకి రానుంది. కోలీవుడ్లో హిట్ అయిన వినోదయ సీతం సినిమాకు రీమిక్కిగా వస్తున్న బ్రో సినిమాకు కోలీవుడ్ నటుడు, దర్శకుడు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమాపై అప్పుడే తీసుకురావడానికి కొందరు కుట్రకు తెర లేపినట్టు సోషల్ మీడియా ట్రెండ్స్ చెబుతున్నాయి.

ఈ సినిమా నిర్మాత పీపుల్స్ మీడియా అధినేత టీజీ విశ్వప్రసాద్ కూడా ఈ విషయం చెప్పడంతో పలు సందేహాలు తలెత్తుతున్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ వ‌కీల్‌సాబ్‌, భీమ్లా నాయక్ సినిమాలు రిలీజ్ అయినప్పుడు కూడా రాజకీయపరంగా చాలామంది టార్గెట్ చేశారు. ఆ సినిమాలు కంటెంట్ పరంగా బాగున్న రాజకీయంగా టార్గెట్ చేయడంతో అనుకున్న స్థాయిలో వసూళ్లు రాబట్ట లేకపోయాయి. ఇప్పుడు బ్రో సినిమా విషయంలోనూ ఇలాంటి కుట్రకు తెరలేపే ప్రయత్నం జరుగుతున్నట్టు తెలుస్తోంది.

సినిమాకు ఎంత మంచి టాక్ వచ్చినా ఏదోలా బ్యాడ్ ట్రాక్ బాగా స్ప్రెడ్ చేయాలని.. ఇందుకు రకరకాల మార్గాలు ఎంచుకోవాలని కొందరు ఇప్పటికే కాచుకుని ఉన్నట్టు తెలుస్తోంది. పవన్ సినిమాలు వచ్చేసరికి ఎప్పుడు ఏదో ఇబ్బంది క్రియేట్ చేసే ప్రయత్నం బాగా జరుగుతోంది. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ రిలీజ్ అయినప్పుడు కూడా ఇలాగే జరిగింది.

ఇప్పుడు బ్రో సినిమాకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురు కానుందా ? అంటే సోషల్ మీడియా ట్రెండింగ్స్‌తో పాటు తెర వెనక జరుగుతున్న పరిణామాలు గమనిస్తున్న ఇండస్ట్రీ పెద్దలు అవునని అంటున్నారు. అయితే సినిమాకు హిట్ టాక్‌ వచ్చి కథలో దమ్ము ఉంటే ఎవరు ఎన్ని ? ప్రయత్నాలు చేసినా బ్రో సినిమా విజయాన్ని ఆపటం ఎవరి తరం కాదని కూడా ఇండస్ట్రీ జనాలు చెబుతున్నారు. మరి పవన్ ఈ నెగెటివిటీని ఎలా ? ఎదుర్కొంటాడో చూడాల్సి ఉంది.