వకీల్‌సాబ్ 45 – బ్రో 41 పవన్ కళ్యాణ్‌కు మాత్ర‌మే ఈ రికార్డ్ సొంతం…!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరుకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు గ‌డ్డ‌పై కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న పవన్ ప్రస్తుతం వారాహి యాత్రలో బిజీగా గడుపుతున్నాడు. అటు సినిమా రంగంలోనూ దూసుకుపోతున్నాడు. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు ప్లాప్ అయినా ఓ రేంజ్ లో రికార్డు స్థాయి కలెక్షన్లు కొల్లగొట్టడం పవన్‌కే సాధ్యం. రాజకీయాల్లో బిజీగా ఉంటున్న పవన్ కళ్యాణ్ సినిమాలను కూడా చాలా త్వరగా పూర్తి చేస్తున్నాడు.

తాజాగా పవన్ కళ్యాణ్.. మేనల్లుడు సాయి ధరంతేజ్ తో కలిసి మల్టీ స్టార్లర్ ‘ బ్రో ది అవతార్ ‘ మూవీలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ నెల‌ 28న రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ పనులను కూడా పూర్తి చేసుకుని క్లీన్ u సర్టిఫికెట్‌తో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమైంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ రిలీజై ప్రేక్షకుల్లో మరింతగా ఆసక్తి పెంచాయి.

‘ బ్రో ‘ సినిమా బిజినెస్ కోట్లలో జరుగుతుంది. ఇక ఈ సినిమా షూటింగ్ కేవలం 41 రోజుల్లోనే పూర్తయిపోయింది. ఒక స్టార్ హీరో సినిమా ఇంత వేగంగా పూర్తి చేయడం సాధారణమైన విషయం కాదు. ఇదే కాదు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తరువాత సినిమాల్లోకి రియంట్రీ ఇచ్చిన మొదటి సినిమా ‘ వకీల్ సాబ్ ‘ కూడా కేవలం 45 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసుకుని ప్రేక్షకులు ముందుకు వచ్చింది.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్స్ అంతా ‘ బ్రో ది అవతార్ ‘ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఏదేమైనా ప‌వ‌న్ లాంటి పెద్ద హీరో ఇంత త‌క్కువ టైంలో సినిమా షూటింగ్ పూర్తి చేయ‌డం అంటే నిజంగా రికార్డే. మిగిలిన హీరోలు కూడా ఇదే బాట‌లో వెళితే పెద్ద సినిమాల బ‌డ్జెట్ చాలా త‌గ్గిపోతుంది.