ఆర్తి అగర్వాల్ దెబ్బ‌కు ప్ర‌భాస్‌కు అంత పెద్ద బొక్కా… ఎవ్వ‌రికి తెలియ‌ని టాప్ సీక్రెట్ ఇదే..!

టాలీవుడ్ దివంగత నటుడు కృష్ణంరాజు నట వారసుడుగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవ‌ల్ లో వరుస సినిమాలు చేసుకుంటూ ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేస్తున్నాడు. అలాంటి ఈ పాన్ ఇండియా హీరో తన కెరీర్‌ మొదటిలో వరుస ప్లాప్‌ల‌తో ఇబ్బందులు పడిన సందర్భాలున్నో ఉన్నాయి. ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ లో హీరోగా అడుగుపెట్టిన ప్రభాస్ తొలి సినిమాతోనే యావరేజ్ హిట్ అందుకున్నాడు.

ఆ తర్వాత చేసిన రెండో సినిమా రాఘవేంద్ర కూడా డిజాస్టర్ అయ్యి ప్రభాస్‌కు భారీ షాక్ ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన మూడో సినిమా వర్షంతో తొలి బ్లాక్ బ‌స్టర్ అందుకున్నాడు ప్రభాస్. ఆ తర్వాత అడవి రాముడు సినిమా జ‌స్ట్ యావ‌రేజ్‌. ఈ సినిమాల్లో ప్రభాస్‌కు జంటగా దివంగత నటి ఆర్తి అగర్వాల్ నటించింది. సీనియర్ దర్శకుడు బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంచ‌నాలు అందుకోలేదు.

ఈ సినిమా హీరోయిన్ ఆర్తి అగర్వాల్ కారణంగానే ప్లాఫ్ అయిందన్న గుస‌గుస‌లు వ‌చ్చాయి. ఈ సినిమా షూటింగ్‌ సమయానికి ఆర్తి అగర్వాల్ బాడీలో మార్పులు రావడంతో ఈమె లావుగా మారింది. ఇక దర్శక నిర్మాతలకు ఈ విషయం తెలిసినా షూటింగ్‌ చాలా రోజుల ముందే ఫిక్స్ చేయడం కారణంగా ఆమె బాడీలో మార్పులు రావటంతో ఏం చేయలేకపోయారు. ఈ సినిమా క‌థ‌, కథనం బాగున్న హీరోయిన్ ఆర్తి అగర్వాల్ కారణంగా అడవి రాముడు సినిమా బాక్సాఫీస్ మ్యాజిక్ రిపీట్ చేయడంలో విఫలమైంది.

అయితే వర్షం సినిమా తర్వాత వచ్చిన అడవి రాముడు కూడా హిట్ అయి ఉంటే ప్రభాస్ క్రేజ్ మరింత పెరుగి ఉండేది. కానీ ఈ సినిమా ప్లాఫ్ అవడం కార‌ణంగా నిర్మాతలకు భారీ నష్టాలు కూడా వచ్చాయని అప్పట్లో పలు వార్తలు కూడా వినిపించాయి. అలాంటి ప్రభాస్ ప్రస్తుతం సలార్‌, ప్రాజెక్టుకే సినిమాలతో బిజీగా కొనసాగుతున్నాడు. ఇక మరి ఈ సినిమాలతో అయినా ప్రభాస్ బాహుబలి లాంటి మరో హిట్ అందుకుంటారో లేదో చూడాలి.-