మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ ఏఎన్నార్ తర్వాత ప్రేక్షకుల దగ్గర నుంచి అంతలా మాస్ ఇమేజ్ తెచ్చుకున్న హీరోలలో చిరంజీవి, బాలకృష్ణ ముందు వరుసలో ఉంటారు. గత నాలుగు దశాబ్దాలుగా మన తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస సినిమాలతో పోటీపడుతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పటికీ ఆరుపదుల వయసు వచ్చిన కూడా ఇద్దరు హీరోలు యంగ్ హీరోలను మించిన క్రేజ్‌తో వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ చేస్తున్నారు.
ఇక ఈ సంక్రాంతి కూడా చిరు- బాలయ్య వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో బాక్సాఫీస్ పోరులో నిలిచి ఇద్దరు విజయం సాధించారు. ప్రస్తుతం చిరంజీవి బోళ శంకర్ సినిమాతో వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అదేవిధంగా బాలకృష్ణ కూడా తన 108వ సినిమా భగవంత్ కేసరితో దసరా బరిలో దూకబోతున్నాడు. ఇలా వరుస సినిమాలతో దూసుకుపోతున్న చిరంజీవి- బాలయ్య గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఇప్పుడు బయటకు వచ్చింది.
గత 40 సంవత్సరాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలుగా కొనసాగుతున్నారు బాలయ్య- చిరంజీవి.. ఇప్పటికే చిరంజీవి 150 కి పైగా సినిమాల్లో నటించాడు.. బాలయ్య కూడా 100 క్రాస్ చేసి.. కంటిన్యూగా సినిమాల్లో నటిస్తూనే ఉన్నాడు.. అలాంటి ఇద్దరు హీరోలు తమ కెరీర్ బిగినింగ్ లో ఎంతో స్నేహంగా ఉండేవారు. బాలయ్య కూడా ఎన్నోసార్లు చిరంజీవి సినిమాలకు చీఫ్ గెస్ట్ గా కూడా వెళ్లాడు.. చిరంజీవి కూడా బాలయ్య సినిమాలకు ముఖ్యఅతిథిగా వచ్చాడు.
చిరంజీవి తన 40 సంవత్సరాల కెరీర్లో ఎందరో హీరోయిన్లతో సినిమాలు చేశారు. అలా వారితో చిరంజీవికి ఎన్నో ఎఫై…*ర్లు ఉన్నట్టు వార్తలు కూడా బయటకు వచ్చాయి. ఇదే క్రమంలో చిరంజీవి స్టార్ హీరోగా ఎదిగిన సమయంలో తనతో పాటు వరుస సినిమాలో నటించిన ఓ హీరోయిన్ ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడని అప్పట్లో ఎన్నో వార్తలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం ఆ హీరోయిన్ ఇప్పుడు చెన్నైలో ఉంటుంది.
అయితే ఆ హీరోయిన్ కు బాలయ్యతో మంచి సాన్నిహిత్యం ఉండేదట. ఇలా బాలయ్య కూడా చిరంజీవి ప్రేమకు అండగా ఉన్నాడని వార్తలు కూడా వినిపించాయి. మధ్యలో ఏం జరిగిందో తెలియదు కానీ చిరు సీనియర్ నటుడు అల్లు రామలింగయ్య కూతురు సురేఖని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆ స్టార్ హీరోయిన్ చెన్నైకి వెళ్ళిపోయింది.. మళ్ళీ తిరిగి టాలీవుడ్ వైపు చూడలేదు. అలా చిరంజీవి ఆ స్టార్ హీరోయిన్ ప్రేమలో బాలయ్య కూడా భాగమయ్యాడంటారు.