టాలీవుడ్‌లో యంగ్ క్రేజీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నాగశౌర్య. ఎంతో మంది హీరోయిన్లతో హిట్ సినిమాలలో నటించిన శౌర్య ఇటీవల రంగబలి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా అనుకున్న రేంజ్‌లో సక్సెస్ కాలేదు. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వీరు చేసిన సందడి మాత్రం ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.
గతంలో నాగశౌర్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాకు రాశి, మాళవికా, సాయి పల్లవి.. ఇలా ఎంతోమందితో ఎఫై… ర్స్ ఉన్నట్టు రాశారు. ఒక్కసారి కూడా అనుష్క శెట్టితో నాకు ఎ..ర్ ఉన్నట్టు రాయలేదు.. నాకు అనుష్క శెట్టి అంటే చాలా ఇష్టం.. ఒక్కసారైనా అనుష్క శెట్టితో ఎ…ర్ ఉన్నట్టు ఎందుకు ? వార్తలు రాయలేదు.. ఒకసారి అనుష్కతో ఎ..ర్ ఉన్నటు రాయమని మీడియాను రిక్వెస్ట్ చేశాడట.
తాజాగా నాగశౌర్య పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అతని భార్య పేరు అనుష్క శెట్టి కావడంతో.. అనుష్క శెట్టి ఫేవరెట్ హీరోయిన్ కాబట్టే అనుష్క శెట్టి పేరు ఉన్న అమ్మాయిని భార్యగా చేసుకున్నాడా ? అంటూ సరదాగా కొందరు నాగశౌర్యను ఆట పట్టించారు. అనుష్క శెట్టిపై ఉన్న ఇష్టంతో ఆమెను పెళ్లి చేసుకునే ఛాన్స్ లేనందునే… ఆ పేరుతో ఉన్న అమ్మాయిని చేసుకున్నాడని కొందరు సరదాగా జోకులు వేసుకున్నారు.
దీనిపై నాగశౌర్య స్పందిస్తే గాని ఈ వార్తలకు తెరపడేలా లేదు. ఇక కొంతకాలంగా వరుస ప్లాప్ లను చవిచూస్తున్న నాగశౌర్య రంగబలి సినిమాతో త్రో బ్యాక్ అవుదాం అనుకుంటే ఈ సినిమా కూడా ప్లాప్ అయింది. నెక్ట్స్ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో తర్వాత సినిమా పై శ్రధ్ద పెడుతున్నాడు నాగశౌర్య .