టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ కాంబినేషన్స్ మనం మిస్ అవుతూ ఉంటాం. అలాంటి కాంబినేషన్‌లో బాలయ్య – సాయి పల్లవి కాంబినేషన్ ఒకటి. టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహ బాలయ్యకి ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. అలాంటిది బాలయ్యతో ఒక సినిమా అవకాశం వస్తే చాలు అని ఎంతో మంది స్టార్ హీరోయిన్లు తహతలాడుతూ ఉంటారు. బాలకృష్ణతో సినిమా అవకాశం వచ్చినా సాయి పల్లవి మాత్రం కారణం చెప్పకుండా ఆ సినిమాను రిజెక్ట్ చేసిందట.
తెలుగు ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి ఎంత పెద్ద సినిమాల్లో నైనా తన క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ లేదంటే ఎలాంటి డౌట్లు లేకుండా నో చెప్పేస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా బాలయ్య హీరోగా తెరకెక్కిన వీరసింహారెడ్డి సినిమా సంక్రాంతి కానుకగా రిలీజై బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో బాలయ్యకు చెల్లె పాత్రలో వరలక్ష్మీ నటించింది.
ముందుగా ఈ సినిమాలో సాయి పల్లవిని.. బాలయ్య చెల్లెలుగా అనుకున్నాడట దర్శకుడు గోపీచంద్ మలినేని. కానీ కారణం కూడా చెప్పకుండా సాయి పల్లవి రిజెక్ట్ చేయడంతో కోపంతో వెంటనే వరలక్ష్మిని ఈ పాత్రలోకి సెలెక్ట్ చేసుకుని సినిమాను తెరకెక్కించాడట దర్శకుడు గోపీచంద్. వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య చెల్లెలి రోల్‌లో వరలక్ష్మీ తన నటనతో అదరగొట్టింది.
ఇప్పుడు ఈ మ్యాటర్ బయటకు రావడంతో బాలయ్య పక్కన నటించే మంచి అవకాశాన్ని రిజెక్ట్ చేసుకున్నావా ? అంటూ బాలయ్య ఫ్యాన్స్ సాయి పల్లవిపై కామెంట్లు చేస్తున్నారు. కొందరు బాలయ్య ఫ్యాన్స్ మాత్రం ఏదో గట్టి కారణం వల్లే ఆమె సినిమాను రిజెక్ట్ చేసి ఉంటుంది అంటూ మద్దతుగా నిలిస్తున్నారు.