చిరు ఫ్యాన్స్ VS పవన్ ఫ్యాన్స్.. నాగబాబు ఎంట్రీ దెబ్బ‌తో అదిరిన ట్విస్ట్‌..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్ర‌స్తుతం రాజకీయల్లో ఫుల్ బిజీ అయిపోయాడు. జనసేన పార్టీ ద్వారా వ‌చ్చే ఏపీ ఎన్నిక‌ల్లో సంచ‌ల‌నం క్రియేట్ చేసేందుకు ఆశ‌తో ఉన్నాడు. వారాహి యాత్ర ద్వారా ప్ర‌జ‌ల్లోకి వెళుతున్నాడు. తాజాగా జనసేన పార్టీ అధికారిక ప్రతినిధి అయిన రాయపాటి అరుణ చిరంజీవిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సంచ‌ల‌నం రేపుతున్నాయి.

అసలు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో కలపడమే పెద్ద తప్పు. చిరంజీవి నిర్ణయం పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితానికి ప్రస్తుతం సంకటంగా మారింది. ఆయన ఫెయిల్యూర్ ఫ్లాట్‌ఫామ్ వేసి వెళ్ళిపోయారు. చిరంజీవి వల్ల రాష్ట్ర ప్రజలు లాస్ అయ్యారని చెప్పింది. చిరుకు నష్టం కలగలేదు.. మళ్ళీ సినిమాలో చేస్తూ హ్యాపీగా ఉన్నారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. దీంతో చిరంజీవి అభిమానులు రాయపాటి అరుణ మెగాస్టార్‌కి క్షమాపణలు చెప్పాలని కోపంతో ఊగిపోతున్నారు.

అరుణ‌కు ప‌వ‌న్ ఫ్యాన్స్ నుంచి కొంత స‌పోర్ట్ వ‌స్తోంది. దీంతో చిరంజీవి ఫ్యాన్స్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మ‌ధ్య ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వార్ న‌డుస్తోంది. రామ్‌చరణ్ అభిమాని, పిఆర్ఓ శివ ఈ ఇష్యూలోకి ఎంట‌ర్ అయ్యి చిరంజీవి యువత పేరుతో ఒక లెటర్ రిలీజ్ చేశాడు. రాయపాటి అరుణ.. చిరంజీవికి క్షమాపణలు చెప్పాలి అంటూ ఆ లెటర్లో రాసుకొచ్చాడు.

దీనికి అరుణ రిప్లై ఇస్తూ ఏకంగా మెగా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి అడిగినా తాను క్షమాపణ చెప్పన‌ని ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వివాదానికి ఎలాగైనా చెక్ పెట్టాలని నాగబాబు రంగంలోకి దిగాడు. రాయపాటి అరుణ జనసేనకు నిస్వార్థ సేవకురాలని.. ఆమె నోరు జారి ఏదో ఒక తప్పు మాటఅన్న అంతమాత్రాన తనను నిందించడం కరెక్ట్ కాదు అంటూ ట్విట్ చేశాడు. దీంతో ఈ వివాదానికి తాత్కాలికంగా ఫుల్‌స్టాప్ ప‌డ‌న‌ట్ల‌య్యింది.