త‌రుణ్ – ఆర్తీ అగ‌ర్వాల్ ప్రేమ‌కు మ‌హేష్‌బాబుకు ఉన్న లింక్ ఇదే..!

దివంగత హీరోయిన్ ఆర్తి అగర్వాల్, యంగ్ హీరో తరుణ్ ప్రేమాయణం అప్పట్లో ఒక సంచలనం. వెంకటేష్ హీరోగా వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో వెండితెరకు హీరోయిన్గా పరిచయం అయింది. ఆర్తి అగర్వాల్ అయితే తన రెండో సినిమా హీరో తరుణ్ తోనే ఆమె పీక‌ల్లోతు ప్రేమలో కూరుకుపోయింది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన నువ్వులేక నేనులేను సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత మరోసారి వీరిద్దరూ కలిసి సోగ్గాడు సినిమాలో నటించారు.

కారణం ఏదైనా ఆర్తి అగర్వాల్ ను తమ ఇంటికి కోడలుగా చేసుకునేందుకు తరుణ్ తల్లి రోజా రమణి ఒప్పుకోకపోవడం.. ఆ తర్వాత వీరి ప్రేమకు పోలీస్ స్టాప్ పడిపోవటం.. ఆర్తి అమెరికాకు చెందిన ఎన్నారై ని పెళ్లి చేసుకుని రెండేళ్లకే విడాకులు ఇచ్చేయటం.. అనంతరం ఆమె అనారోగ్యంతో మృతి చెందటం అన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే వీరిద్దరి ప్రేమకు సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఒక చిన్న లింక్ ఉంది.

తరుణ్ – ఆర్తి అగర్వాల్ తొలిసారిగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో నటించారు. ఆ సినిమాతోనే వీరిద్దరి ప్రేమకు బీజం పడింది. ఆ సినిమా దర్శకుడు కాశీ విశ్వనాథ్ సురేష్ బాబుకు కథ చెప్పగానే మహేష్ బాబుతో ఈ సినిమా తీయాలని సురేష్ బాబు పట్టుబ‌ట్టారట. అయితే అప్పటికే మహేష్ బాబు ఇతర సినిమాలతో బిజీగా ఉండడంతో తరుణ్ హీరోగా ఈ సినిమా తెరకెక్కించారు
కాశీ విశ్వనాథ్.

ఒకవేళ ఆ సినిమాలో సురేష్ బాబు కోరిక మేరకు మహేష్ హీరోగా నటించి ఉంటే కచ్చితంగా ఆర్తికి తొలి సినిమాతోనే మహేష్ బాబు లాంటి పెద్ద హీరోతో నటించే అవకాశం వచ్చినట్లు అయ్యేది. ఆ తర్వాత ఆమెకు అస్సలు తిరుగే ఉండేదే కాదు. అయితే అనుహ్యంగా ఆమె తరుణ్ తో నటించడం.. ఆ త‌రుణ్‌తోనే ప్రేమలో పడటం.. చివరకు చిన్న వయసులోనే ఆమె కెరీర్ పాతాళంలో పడిపోవడంతో పాటు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం అని జరిగిపోయాయి.