సినీ ఇండస్ట్రీలో నటించే స్టార్ హీరో, హీరోయిన్స్ కొన్ని కోట్లలో రెమ్యూనరేషన్ సంపాదిస్తూ ఉంటారు. హీరో హీరోయిన్లతో సమానంగా కమెడియన్స్ కూడా రెమ్యూనిరేషన్ తీసుకుంటారు. ప్రతి సినిమాలో కమెడియన్ పాత్ర ఎంత కీరోలు ప్లే చేస్తుందో అందరికీ తెలిసిందే. కామెడీ లేని సినిమాలకు ప్రేక్షకులు అంతగా కనెక్ట్ కారు. ఇక విషయానికి వస్తే టాలీవుడ్ ఇండస్ట్రీలో రోజుకి కొన్ని లక్షల్లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కమీడియన్లు ఎవరో ఒకసారి చూద్దాం.
బ్రహ్మానందం :
హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ఎన్నో హిట్ సినిమాల్లో తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న బ్రహ్మానందం రోజుకి రూ.2 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట.
ఆలీ :
చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి పరిచయమై.. కొన్ని కామెడీ సినిమాల్లో హీరోగా కూడా నటించిన ఆలీ రోజుకు రూ.3.5 లక్షల వరకు చార్జ్ చేస్తున్నాడట.
వెన్నెల కిషోర్ :
గత కొంతకాలంగా టాలీవుడ్లో స్టార్ కమెడియన్ ఒక వెలుగు వెలుగుతున్న వెన్నెల కిషోర్ రోజుకు రూ.2 నుంచి రూ.3 లక్షల వరకు రెమ్యూనరేషన్ పుచ్చుకుంటున్నాడట.
సునీల్ :
ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సునీల్ తర్వాత హీరోగా మారాడు. సునీల్ ఒక్క రోజుకు రూ.4 లక్షలు వరకు రెమ్యునరేషన్ చార్జ్ చేస్తున్నాడు.
ప్రియదర్శి :
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్గా మంచి క్రేజ్ సంపాదించుకున్న ప్రియదర్శి రోజుకు రూ.2 లక్షల రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నాడట.
పోసాని కృష్ణ మురళి :
ఒకప్పటి స్టార్ కమెడియన్ పోసాని కృష్ణమురళి రోజుకు రూ.2 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట.