ఎన్టీఆర్ ల‌క్కీ హీరోయిన్ అక్కినేని ప‌క్క‌న ఎందుకు చేయ‌లేదు… అప్ప‌ట్లో సెన్షేష‌న్‌..!

ఒక‌ప్ప‌టి అగ్ర‌హీరోయిన్లు అంద‌రూ అన్న‌గారు ఎన్టీఆర్‌తోనూ.. అదేవిధంగా అక్కినేని నాగేశ్వ‌ర‌రావు.. త‌మి ళంలో అయితే ఎంజీఆర్‌, క‌న్న‌డ‌లో రాజ్‌కుమార్ ఇలా.. అంద‌రితోనూ.. క‌లిసి అనేక సినిమాలు చేశారు. వీరిలో సావిత్రి నుంచి భానుమ‌తి వ‌ర‌కు ఎంద‌రో వివిధ భాషా సినిమాల్లో న‌టించారు. మెప్పించారు కూడా. అదేవిధంగా సొంత బ్యాన‌ర్ల‌పై సినిమాలు కూడా చేశారు. అప్ప‌ట్లో ఇలా న‌టించ‌డాన్ని ప్ర‌విలేజ్‌గా కూడా భావించేవారు.

కేవ‌లం ఒక్క‌రిద్ద‌రు హీరోల‌తోనే న‌టించ‌డం అన్నా.. ఒకే భాష‌లో సినిమాలు చేయ‌డం అన్నా.. ఒకింత అవ‌మానంగా భావించేవారట‌. త‌మ‌తోపాటు ఉన్న హీరోయిన్లు అవ‌కాశాలు అందిపుచ్చుంటే.. తాము మాత్రం వెనుక‌బ‌డిపోతున్నామ‌నే ఫీలింగ్‌లోనూ ఉండేవార‌ట‌. దీంతో పోటీ కోసం అయినా.. ప‌ర భాషా సినిమాల్లోను.. ఎక్కువ మంది హీరోల‌తోనూ న‌టించిన సంద‌ర్భాలు హీరోయిన్ల‌కు ఉన్నాయి.

అయితే.. అంద‌రూ అన్ని అవ‌కాశాలు అందిపుచ్చుకుంటార‌ని చెప్ప‌లేం. కొన్ని కొన్ని అవ‌కాశాలు కొంద‌రికే వ‌స్తుంటాయి. ఇలానే అప్ప‌టి అగ్ర తార‌.. దేవిక కూడా.. కొన్ని కొన్ని అవ‌కాశాలు అందుకోలేక పోయారు. ఎన్టీఆర్‌తో అనేక సినిమాలు చేసిన దేవిక‌.. త‌ర్వాత త‌రం న‌టులైన శోభ‌న్‌బాబుతోనూ.. హీరోయిన్‌గా క‌లిసి న‌టించారు. ఎన్టీఆర్ త‌న‌కు దేవిక ల‌క్కీ హీరోయిన్ అనేవారు కూడా..! కానీ, ఎన్టీఆర్ స‌మ‌కాలికుడు అయిన‌.. అక్కినేనితో ఆమె తెర పంచుకునే అవ‌కాశం మాత్రం రాలేదు.

ఒక‌టి రెండు సార్లు తీవ్ర‌స్థాయిలో ప్ర‌య‌త్నాలు చేసినా.. ఎందుకో మిస్స‌మ్మ వంటి సినిమాల్లో ముందు అనుకుని త‌ర్వాత కాద‌నుకున్నారు. దీంతో ఎన్టీఆర్‌తో ద‌క్ష‌య‌జ్ఞం వంటి సూప‌ర్ హిట్ సినిమా చేసిన త‌ర్వాత కూడా.. అక్కినేనితో ఆమెకు ఆఫ‌ర్లు రాలేదు. ప్ర‌య‌త్నాలు చేసిన ఫ‌లించ‌లేదు. చాలా సంవ‌త్స‌రాల త‌ర్వాత‌.. మాత్రం అక్కినేనితో న‌టించినా.. క్యారెక్ట‌ర్ పాత్ర‌ల‌కే దేవిక ప‌రిమితం అయ్యారు. “ఎంతో మందితో క‌లిసి న‌టించినా.. అక్కినేనితో న‌టించ‌లేక పోయాన‌నే అసంతృప్తి ఉంది“ అని ప‌లు మార్లు ఆమె చెప్పుకొన్నారు.