‘ బేబీ ‘ 5 రోజుల క‌లెక్ష‌న్లు… ఫ‌స్ట్ డేను మించి భీభ‌త్సం..!

ఆనంద్ దేవరకొండకు మొత్తానికి బాక్సాఫీస్ వద్ద ఫ‌స్ట్ టైం ఊహించ‌ని రేంజ్ హిట్ కొట్టేశాడు. మొదటిసారి హీరోయిన్ గా వెండితెర‌పై కనిపించిన వైష్ణవి చైతన్య కూడా త‌న కెరీర్‌లోనే ఎప్పటికి గుర్తుండిపోయేలా మెమ‌ర‌బుల్ హిట్ త‌న అక్కౌంట్లో వేసుకుంది. ఈ బేబీ సినిమా దెబ్బ‌తో దర్శకుడు సాయి రాజేష్ కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాడు. అటు నిర్మాత నిర్మాత SKN ప్రాఫిట్స్ జోష్ లో మునిగి తేలుతున్నాడు.

ఇక బేబీ సినిమా ఐదో రోజుల ర‌న్ పూర్తి చేసుకుంది. కేవ‌లం రు. 8 కోట్ల టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన ఈ సినిమా ఐదు రోజులు పూర్త‌య్యే స‌రికి 16.01 కోట్లు షేర్ 28.15 కోట్లు గ్రాస్ వచ్చింది. అంటే ఇప్ప‌టికే రు. 10 కోట్ల‌కు పైగా లాభాలు వ‌చ్చేశాయి. ఈ సినిమా టోట‌ల్ ర‌న్‌లో రు. 60 – 70 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు కొల్ల‌గొట్టినా ఆశ్చ‌ర్య పోన‌క్క‌ర్లేదని ట్రేడ్ వ‌ర్గాలు చెపుతున్నాయి.

ఇక బేబి సినిమాకు ఏపీ, తెలంగాణ‌లో రోజు వారి వ‌సూళ్లు చూస్తే మొదటిరోజు 2.60 కోట్లు – రెండవ రోజు 2.98 కోట్లు – మూడవ రోజు 3.77 కోట్లు – నాలుగో రోజు 3.72 కోట్లు ఐదవ రోజు 2.94 కోట్లు వచ్చాయి. విచిత్రం ఏంటంటే ఐదో రోజు ఫ‌స్ట్ డే కంటే కూడా ఎక్కువ వ‌సూళ్లు వ‌చ్చాయి. ఇది నిజంగానే సెన్షేష‌న‌ల్ అనుకోవాలి.

ఇప్ప‌ట‌కీ అన్ని ఏరియాల్లోనూ హౌస్‌ఫుల్ బోర్డులు క‌నిపిస్తున్నాయి. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తంలో చూసుకుంటే 70 లక్షల షేర్ రాగా… అటు ఓవర్సీస్ లో 2 కోట్లు రాబ‌ట్టింది. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌ర‌ల్డ్ వైడ్‌గా బేబీ సినిమా 5 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 18.71 కోట్లు షేర్ రాబట్టింది. అంటే ఇప్పటివరకు పెట్టిన పెట్టుబడి కంటే ఈ సినిమా ఎక్కువ స్థాయిలో రాబట్టి 10 కోట్లకు పైగా ప్రాఫిట్స్ వ‌చ్చేశాయి. ఇక ఇప్పుడు మ‌రిన్ని లాభాలు ఈ సినిమా క‌ళ్ల‌చూడ‌నుంది.