స్టార్ హీరోగా ఎదిగి.. ట్యాక్సీ డ్రైవర్ గా మారిన ‘ప్రేమదేశం’ హీరో అబ్బాస్.. ఇన్ని కష్టాలు అనుభ‌వించాడా..పాపం..!!

ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అబ్బాస్ అప్పట్లో అమ్మాయిలు కలలో రాకుమారుడు గా ఉండేవాడు. ఎన్నో సినిమాల్లో హీరోగా నటిస్తూనే.. కొందరు స్టార్ హీరో సరసన కీ రోల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా స్టార్‌డం తెచ్చుకున్న కొంతకాలానికి సినిమాలకు దూరమైన అబ్బాస్ ఒకానొక టైంలో మెకానిక్‌గా, ట్యాక్సీ డ్రైవర్ గా కూడా పనిచేశాడట. ‘ ప్రేమదేశం ‘ సినిమా ద్వారా టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న అబ్బాస్ అలా సినిమాలకు దూరమై టాక్సీ డ్రైవర్ గా ఎందుకు మారాల్సి వచ్చిందనే విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు. విదేశాల నుంచి స్వదేశానికి వచ్చేందుకు ఆయన ఎదుర్కొన్న ఒడిదుడుకుల ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నాడు.

స్టూడెంట్‌గా ఉన్న టైంలో నాకు చదువుపై ఆసక్తి లేదు.. నేను అనుకోకుండా నటుడిని అయ్యాను.. సాధారణ ప్రేక్షకుడిలా నా తొలి సినిమా ‘ ప్రేమదేశం ‘ ప్రీమియర్‌కి వెళ్ళా. ఈ సినిమా సక్సెస్ తరువాత రోజు మా ఇంటి ముందు సముద్రాన్ని తలపించే విధంగా జనం. అంతమంది అభిమానులను చూసి ఆశ్చర్యపోయా. ఎందుకు నాపై అంత ప్రేమ చూపిస్తున్నారో నాకు అర్థం కాలేదు. 19 ఏళ్ళ వయసులో డబ్బు సంపాదించేందుకు.. సినిమాని ఓ మార్గంగా ఎంచుకున్న నేను కెరియర్ ప్రారంభంలో విజయాలు అందుకున్నా.. తర్వాత ఎన్నో ఫెయిల్యూర్స్‌ని చూశాను. అలాంటి టైం లో అవకాశం కోసం ప్రొడ్యూసర్ ఆర్‌ బి చౌదరి గారిని కలిసాను ఆయన నాకు ‘ పువల్లి ‘ సినిమాలో అవకాశం ఇచ్చారు.

కొంతకాలానికి నాకు యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ పోయింది సినిమాలకు దూరంగా వెళ్ళిపోయా. న్యూజిలాండ్‌కి వెళ్లి సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుందామని అనుకున్నాను అక్క‌డికి వెళ్ళాక ఆర్థిక పరిస్థితులు బాగోక కుటుంబాన్ని పోషించడానికి బైక్ మెకానిక్, టాక్సీ డ్రైవర్‌గా పని చేయాల్సి వచ్చింది. ఎన్నో కష్టాలు అనుభవించా అని అబ్బాస్ చెప్పాడు. ప్రేమదేశం సినిమాతో సూపర్ హిట్ సాధించిన అబ్బాస్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్నో సినిమాలతో హిట్ తన ఖాతాలో వేసుకుని విభిన్న పాత్రలను పోషించిన అబ్బాస్ 2015 నుంచి ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఇటీవలే తాజాగా మ‌ళ్ళి ఇండియాలో అడుగుపెట్టాడు అబ్బాస్.