సింగర్ సునీతకు ఆ స్టార్ డైరెక్టర్‌కు మధ్య ఉన్న సంబంధం ఏంటి..? వారి మధ్య అంత క‌థ‌ నడిచిందా..?

టాలీవుడ్ స్టార్ సింగర్ సునీత గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు . తన మెలోడియస్ గొంతుతో ఎన్నో అద్భుతమైన పాటలను ప్రేక్షకులకు అందించింది. అలాంటి సింగర్ సునీత సినీ కెరియర్ ఎంతో మంచిగా ఉన్నప్పటికీ ఆమె వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. కేవలం 19 ఏళ్ల వయసులోనే ఇంట్లో నుంచి బయటకు వెళ్లి ఎవరికీ తెలియకుండా కిరణ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని తన కుటుంబానికి దూరమైంది. తర్వాత కొన్ని సంవత్సరాలకి ఫ్యామిలీ మళ్ళి దగ్గరకి తీసుకుంది.

అలా సింగర్ సునీతకు ఇద్దరు పిల్లలు పుట్టగానే తన కుటుంబంతో కలిసి ఉంటూనే మళ్ళీ పాటల పాడటం కూడా మొదలుపెట్టింది. ఆ విధంగా చత్ర పరిశ్రమలో సింగర్ గా మరి ఆర్థికంగా కూడా మంచిగా ఎదిగింది. సింగర్ గా తనకొచ్చిన సంపాదనతో కొంత తన కుటుంబానికి మరికొంత తన స్నేహితులకు ఇచ్చి చివరగా మిగిలింది తన కుటుంబానికిి ఉపయోగించేది. ఇదే సమయంలో సునీత సంపాదిస్తున్న డబ్బులను స్నేహితులకు తన కుటుంబానికి ఇవ్వటం ఆమె భర్తకు ఇష్టం ఉండేది కాదట.

ఈ కారణంతోనే సునీతకు తన భర్త కిరణ్‌తో ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉండేవట. అంతేకాకుండా సునీతకి ఇతర మ్యూజిక్ డైరెక్టర్లతో అక్రమ సంబంధం ఉందని అందుకే వారు ఈ అవకాశాలు ఇస్తున్నారని చిత్ర పరిశ్రమలో ఉండే కొందరు సునీత అంటే పడని వారు కొన్ని ఫేక్ వార్తలు ప్రచారం చేసేవారు. ఆ వార్తలు నిజమని నమ్మిన సునీత భర్త కిరణ్ తరచూ సూటి పోటి మాటలతో నిందిస్తూ అవమానించే వాడట. ఆ తర్వాత కొన్ని రోజులకు సునీత భర్త కిరణ్ ఫ్రెండ్ అయినా దర్శకుడు విఎన్ ఆదిత్యతో సునీత ఎంతో స్నేహంగా ఉండేది.

అయితే వారి మధ్య ఉన్న స్నేహాన్ని చూసి కిరణ్ వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని అందుకే వీళ్ళు ఇంత క్లోజ్ గా ఉంటున్నారని గొడవ చేయటం మొదలు పెట్టారట. అదే స‌మ‌యంలో సునీత- విఎన్ ఆదిత్య మధ్య ఉన్న రిలేషన్ ఏకంగా సోషల్ మీడియాలోనేే కాకుండా చిత్ర పరిశ్రమలోనే హాట్ టాపిక్ గా మారిందట. అంతేకాకుండా సునీత తన భర్తకు విడాకులు ఇచ్చి ఆదిత్యను పెళ్లి కూడా చేసుకోబోతుందనే ప్రచారం కూడా చేశారట. కానీ అందులో ఏం మాత్రం నిజం లేదు. ఇక ప్రస్తుతం సునిత మ్యాంగో మ్యూజిక్ అధినేత రామ్‌ను రెండో వివాహం చేసుకొని తన లైఫ్ ను ఎంతో హ్యాపీగా కొనసాగిస్తుంది.