పెళ్లి పీటలెక్కుతోన్న కేథ‌రిన్‌… పెళ్లి కొడుకు ఎవ‌రంటే…!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాదిలో చాలామంది స్టార్ సెలబ్రిటీస్ పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ప‌లువురు హీరోలు, హీరోయిన్లు పెళ్లిపీట‌లు ఎక్కుతున్నారు. తాజాగా టాలీవుడ్ కి చెందిన మరో స్టార్ హీరోయిన్ పెళ్లి పీటలు ఎక్క‌బోతోందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆమె ఎవరో ? కాదు అల్లు అర్జున్ తో కలిసి ఇద్దరమ్మాయిలు, సరైనోడు, రుద్ర‌మ‌దేవి సినిమాల‌లో నటించిన హాట్ బ్యూటీ కేథరిన్.

మొదట కోలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కేథరిన్ ఆ తరువాత ఛ‌మ్మక్ ఛ‌ల్లో సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతో సక్సెస్ రాకపోయినా కేథరిన్ నటనకు మంచి గుర్తింపు వచ్చింది.
ఆ తర్వాత కూడా అవకాశాలు రావడంతో పైసా, రుద్రమదేవి, సరైనోడు, ఇద్దరమ్మాయిలతో, నేనే రాజు నేనే మంత్రి, గౌతమ్ నందా, వరల్డ్ ఫేమస్ లవర్, మాచర్ల నియోజకవర్గం ఇలా చాలా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

కేథరిన్ నటించిన సరైనోడు, పైసా, ఇద్దరమ్మాయిలతో సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం అవకాశాలు లేకపోవడంతో టాలీవుడ్‌కి దూరంగా ఉంటుంది. సినిమాల్లో నటించకపోయినా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన హాట్ ఫొటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి కన్నుల పండుగ చేస్తూ ఉంటుంది. కేథరిన్ సినిమాల్లోకి వచ్చిన మొదట్లో మంచి ఫిజిక్ మెయింటైన్ చేసిన కేథరిన్ ప్రస్తుతం కాస్త బొద్దుగా తయారైంది. ఆమె అందం మాత్రం ఏమాత్రం తగ్గలేదు.

ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్ల‌ తో పాపులారిటీ సంపాదించుకున్న కేథరిన్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కపోతుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. తన చిన్ననాటి స్నేహితుడిని కేథరిన్ ప్రేమిస్తుందంటూ.. వీరిద్దరి ప్రేమను ఇరు కుటుంబాలు కూడా ఓకే చేశారని.. ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత? నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో కేథరిన్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.