ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఏం చెప్పినా నిజం అవుతుండడంతో ఇప్పుడు వేణు స్వామి చెప్పే విషయాలకు బాగా ప్రాధాన్యం ఏర్పడింది. టాలీవుడ్ క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న నాగచైతన్య – సమంత విడాకులు తీసుకుంటారని వేణు స్వామి ముందే చెప్పారు. వేణు స్వామి అలా చెప్పినప్పుడు చాలా విమర్శలకు వచ్చాయి. అనుహ్యంగా వేణు స్వామి చెప్పిందే చివరకు నిజం అయింది.
నాగచైతన్య – సమంత నాలుగేళ్లు కూడా కాపురం చేయకుండానే విడాకులు తీసుకున్నారు. దీంతో వేణుస్వామి పేరు ఒక్కసారి వార్తల్లో మారుమోగింది. మరీ ముఖ్యంగా వేణు స్వామి సెలబ్రిటీల పెళ్లిళ్లు, విడాకులు వారి వ్యక్తిగత జీవితం గురించి చెప్పిన జోస్యం నిజం కావడంతో బాగా ఫేమస్ అయిపోయారు. సమంత – నాగచైతన్య పెళ్లి చేసుకోక ముందే వీరిద్దరూ కలిసి ఎన్నాళ్లో కాపురం చేయరని వేణు స్వామి అప్పట్లోనే సంచలనం రేపారు.
తాజాగా ఈ విడాకులకు గల కారణం చెప్పి ఆయన మరో సెన్సేషనల్ క్రియేట్ చేశారు. నాగచైతన్య – సమంత పెళ్లి బంధం ఎక్కువ కాలం నిలవక పోవడానికి.. అసలు కారణం వారిద్దరి గ్రహాలు అనుకూలించకపోవటమే అని తెలిపారు. వీరిద్దరి జాతకంలో శని ఉచ్ఛ స్థితిలో ఉందని.. అందుకే వీళ్ళు కలిసి ఉండలేరు అని తాను ముందే చెప్పినట్టు వేణు స్వామి తెలిపారు. ఈ క్రమంలోనే ఆయన మరో షాక్ కూడా ఇచ్చారు.
ఇలా ఉన్న జాతకస్తులకు రెండు మూడు పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉందని చెప్పారు. అయితే వీరి జీవితాల్లో రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకున్న అవి కూడా నిలిచే అవకాశం లేదని చెప్పటం గమనార్హం. వీరిద్దరి జాతకాల్లో శని ఉచ్చ స్థితిలో ఉండడంతో చైతు, సమంత మళ్ళీ పెళ్లి చేసుకున్నా అవి ఎంతవరకు నిలుస్తాయో చెప్పటం కష్టమని వేణు స్వామి తన మాటల్లో చెప్పకనే చెప్పారు. మరి వీరిద్దరి తర్వాత వైవాహిక జీవితాలు ఎలా ? ఉంటాయో కాలమే ఆన్సర్ చేయాలి.