ఎన్టీఆర్- ప్రభాస్ నటించిన ఆ రెండు ప్లాప్ సినిమాలల్లో ఉన్న కామన్ పాయింట్ ఇదే.. అందుకే దొబ్బేశాయా..?

పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస భారీ సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ పై దండయాత్ర మొదలుపెట్టాడు. బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్ ఆ సినిమాల తర్వాత ఒక్కటి కూడా సరైన విజయం అందుకోలేకపోయాడు. రీసెంట్ గా ఎన్నో అంచనాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఆదిపురుష్‌ కూడా ప్రేక్షకులను ఎంతగానో నిరాశపరిచింది.

అలాంటిది ప్రభాస్ అభిమానులు అందరూ కూడా సలార్, ప్రాజెక్ట్ కే సినిమాల పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ప్రభాస్ విషయం ఇలా ఉంచితే మరో టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి కుటుంబం నుంచి మూడోతరం నట వారసుడుగా వచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా తన తాతకు తగ్గ మనవడిగా తనదైన రీతిలో సినిమాలు చేస్తూ భారీ క్రేజ్‌ను అందుకున్నాడు. త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరో గానే కాకుండా గ్లోబల్ క్రేజ్ అందుకున్నాడు.

అలాంటి ఇద్దరు హీరోలు నటించిన రెండు సినిమాల కథలు ఆల్మోస్ట్ ఒకే విధంగా ఉన్నాయి. అలా ఇద్దరు హీరోలు నటించిన ఆ సినిమాలు ఏమిటంటే ఇప్పుడు చూద్దాం. ప్రభాస్ నటించిన రెబల్, ఎన్టీఆర్ నటించిన రామయ్య వస్తావయ్య ఈ రెండు సినిమాలు కూడా కొద్ది గ్యాప్ లోనే ప్రేక్షకులు ముందుకువచ్చాయి. ప్రభాస్ రెబల్ సినిమాను లారెన్స్ డైరెక్ట్ చేయగా. ఎన్టీఆర్ రామయ్య వస్తావయ్య సినిమాని హరీష్ శంకర్ తెరకెక్కించాడు.

అయితే ఈ రెండు సినిమాల్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ లో హీరోయిన్ చనిపోతే హీరో విలన్స్ మీద రివేంజ్ తీర్చుకోవడం కోసం మరో హీరోయిన్ ను లవ్ చేస్తాడు. ఇక ఈ రెండు సినిమాల్లో కూడా సెకండ్ హీరోయిన్ల‌ నాన్నలే విలన్స్ గా ఉండటం మనం గమనించవచ్చు.. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్లు గా మిగిలిపోయాయి.