ఆడవారి శాపం ఊరికే పోదు అంటారు మన పెద్దలు.. ఇప్పుడు ఇదే స్టార్ హీరోయిన్ కాజల్ విషయంలో నిజమైందని అనిపిస్తుంది. స్టార్ హీరోయిన్ కాజల్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్గా అడుగు పెట్టిన ఈమె తర్వాత స్టార్ హీరోల సినిమాలతో నటించి తన అందచందాలతో అగ్ర హీరోయిన్గా మారింది ఈ ముద్దుగుమ్మ. ఎలాంటి పాత్ర అయినా సరే అవలీలగా నటించే కాజల్ చాలా సైలెంట్ అంటూ ఇండస్ట్రీలో టాక్ కూడా ఉంది.
కాజల్‌కు ఎంత కోపం వచ్చినా సరే బయటపడదు.. ఆ కోపాన్ని తన బాధను తనలోనే ఉంచుకొని పక్క వాళ్ళపై ఆ కోపాన్ని చూపించదు. కాగా ఇదే కాజల్ కెరీర్ కి మొదట మైనస్ గా మారిందట. కెరీర్ తొలినాలలో సినిమా అవకాశాల కోసం ట్రై చేస్తున్న సమయంలో ఓ డైరెక్టర్ ఆమెతో ఎంతో అసభ్యంగా ప్రవర్తించాడని.. అయినా కూడా కాజల్ ఆయన డైరెక్షన్లో ఓ సినిమా కూడా చేసిందని అప్పుడు ఆమెకు ఇండస్ట్రీలో ఇలాంటివి ఉంటాయని తెలియదట. అంతేకాకుండా ఆమెకు ఆ సమయంలో అంతగా గుర్తింపు లేదని ఈ క్రమంలోనే కేరీర్ బిగినింగ్ లో కాజల్ పై ఆ డైరెక్టర్ ఎంతో టార్చర్ చేసిన సైలెంట్ గా ఉండిపోయింది అన్న వార్త ఇప్పుడు వైరల్ గా మారింది.
అంతేకాదు కాజల్ అప్పుడు పెట్టిన శాపనార్ధాలు ఆ డైరెక్టర్ కి బాగా తగిలినట్లు ఉన్నాయి.. అందుకే ప్రజెంట్ అడ్రస్ లేకుండా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయాడు ఆ డైరెక్టర్ అంటూ కాజల్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు .ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కాజల్ మంచి మంచి అవకాశాలను దక్కించుకుంటూ తనదైన స్టైల్ లో ముందుకెళ్తుంది. ఇప్పుడు ఎవ్వరైన తనతో అలా బీహేవ్ చేస్తే ఎదురించే ధైర్యం వచ్చిందట..!!