కళా తపస్వి కే. విశ్వనాథ్ సినిమాల్లో అవకాశం కోసం.. ఎంతో మంది కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసేవారు. ఆయన సినిమాలలో చిన్న పాత్ర దక్కినా చాలని సంబరపడేవారు. ఒక్కొక్కసారి అసలు పారితోషికం కూడా తీసుకోకుండానే నటించేందుకు రెడీ అయిన క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారంటే ఆశ్చర్యం వేస్తుంది. ధర్మవరపు సుబ్రహ్మణ్యం అయితే.. మీ దగ్గర అవకాశం రావడమే మా ఇంటికిలక్ష్మీదేవి వచ్చినట్టు అని అనేవారు.
అలా.. కే. విశ్వనాథ్ దర్శకత్వ ప్రతిభ పరిఢవిల్లింది. తెలుగు సినీ రంగంలో ఆయన ఒక కళా తపస్వి. అయితే.. ఆయన సినిమాలో అవకాశం దొరికిందనే సంబరం ఒకవైపు ఉన్నా.. సినిమా విడుదలయ్యాక.. ఆ సీన్‌లో నటించకుండా ఉంటే బాగుండేదన్న అభిమానుల ఒత్తిడితో కేఆర్ విజయ తంటాలు పడ్డారు. చాలా రోజులు ముఖం కూడా చూపించలేకపోయారట. అదే.. సూత్రధారులు సినిమా. అక్కినేని నాగేశ్వరరావు, మురళీ మోహన్ బావ, బావమరుదుల పాత్రల్లో నటించిన సినిమా.
దీనిలో హీరో విషయంలోనూ అనేక మతలబులు జరిగాయి. ముందు రాజేంద్రప్రసాద్‌ను అనుకున్నారు. కానీ, మేకప్ వేసుకున్నాక రెండు సీన్లు షూట్ చేశాక నచ్చలేదు. దీంతో ఆ ప్లేస్‌ను మార్చేశారు. ఇక, ఈ సినిమాలో సత్యనారాయణ విలన్. కేఆర్ విజయ శాస్త్రీయ సంగీత కచేరీ (హరికథలు) చేసే పాత్ర నుపోషించారు. అయితే, ఓ సందర్భంలో ఈమె పై కన్నేసిన విలన్ పాత్ర ధారి సత్యనారాయణ ఓ రాత్రి వేళ ఇంటికివెళ్లి రేప్ చేస్తాడు. ఇక్కడ నుంచి కథ మొత్తం సీరియస్ అయిపోతుంది.
అయితే.. ఈ సీన్‌లో విశ్వనాథ్ కథను బట్టికొంత దూకుడు ప్రదర్శించారు. కేఆర్ విజయపై రేప్ సీన్‌ను బాగా రక్తి కట్టించారు. అయితే.. అప్పటి వరకు బాగానే ఉన్నా.. సినిమా విడుదలయ్యాక.. అప్పటి వరకు కేఆర్ విజయను.. అమ్మవారి పాత్రల్లో చూసిన ఆమె అభిమానులు నొచ్చుకున్నారు. ఆమెను ఒకింత విమర్శిస్తూ.. లేఖలు కూడా రాశారు. ఈ పాత్రలో ఆ సీన్‌లో నటించకుండా బాగుండేదని అభిమానులు ఒత్తిడి తెచ్చారు. దీంతో కేఆర్ విజయకు మొహం చెల్లక ఆరు మాసాల పాటు ఇంటి నుంచి బయటకు రాలేదట.