ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన ప్రేమ కథ చిత్రం ‘ బేబీ ‘ . ఈ సినిమా ఈ వీకెండ్ థియేటర్లలోకి వచ్చి జనాల్ని బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంది. ఈ సినిమా పీఆర్ బృందం నుంచి తాజా అప్డేట్ ప్రకారం బేబీ 3 రోజుల ఫస్ట్ వీకెండ్ లో ప్రపంచవ్యాప్తంగా రూ. 23.52 కోట్ల గ్రాస్ దక్కించుకుంది.
ఈ సినిమా ఇప్పటికే అనేక ప్రాంతాలలో బ్రేక్ ఈవెన్ సాధించింది. ఈవారం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. చాలా ఏరియాల్లో భారీ లాభాల్లోకి వచ్చేసింది. ఇంత తక్కువ బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా ఆనంద్ దేవరకొండ , వైష్ణవి చైతన్యకి గొప్ప హిట్ సినిమా అని చెప్పాలి. ఈ సినిమా ఏరియా వైజ్ వసూళ్లు ఇలా ఉన్నాయి.
నైజాం – రూ 8.56 కోట్లు
వైజాగ్ – రూ 2.82 కోట్లు
తూర్పు – రూ 1.38 కోట్లు
వెస్ట్ – రూ 0.83 కోట్లు
కృష్ణ – రూ 1.33 కోట్లు
గుంటూరు – రూ 1.08 కోట్లు
నెల్లూరు – రూ 0.69 కోట్లు
సీడెడ్ – రూ 2.09 కోట్లు
కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా – రూ 0.77 కోట్లు
ఓవర్సీస్ – రూ 3.94 కోట్లు
3 రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ రూ.23.52 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఈ సినిమా కి సాయి రాజేష్ దర్శకత్వం వహించగా, విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందించారు.