సినిమా ఇండస్ట్రీలో వారసులు, వారసురాళ్లు హీరో ,హీరోయిన్ గా కొనసాగడం సాధ్యమే. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారిద్దరూ పిల్లలను కూడా చైల్డ్ ఆర్టిస్టులుగా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ కూతురు అర్హ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
ఇప్పటికే ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. చిన్న వయసులోనే తన నటనతో జనాల్ని ఆకట్టుకుంది. అర్హ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన శాకుంతలం సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది. ఈ సినిమాలో అర్హ చిన్నప్పటి భరతుడు పాత్రను పోషించింది. ఈమె రెండో సినిమాగా ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తుంది.
ఈ సినిమాలో అల్లు అర్హ పాత్ర కొద్ది నిమిషాలు పాటు ఉంటుందని సమాచారం. ఈ కొద్ది నిమిషాలకు అర్హ రెమ్యూనరేషన్ గురించి వైరల్ అవుతోన్న వార్తలు కూడా ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. తాము చేసి కొద్ది నిమిషాలు పాత్ర కోసం 20 లక్షల రూపాయలు అర్హకు ఇస్తున్నారట. ఇది నిజంగా అర్హ రేంజ్‌కు చాలా పెద్ద రెమ్యునరేషన్ అనాలి.
అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార కూడా జ్యూవెల్లరీ బ్రాండ్ అంబాసిడర్‌గా చేసినందుకు ఏకంగా కోటి రూపాయలు దాకా తీసుకుందట. ఈ స్టార్ హీరో కూతుర్లు చిన్నవయసులోనే ఇంత రెమ్యూనరేషన్ తీసుకుంటుంటే.. రేపు హీరోయిన్లుగా ఎదిగితే ఇంకెంత రెమ్యూనిరేషన్ తీసుకుంటారో ? చూడాలి.