ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్గా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా బేబీ, లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా సాయి రాజేష్ దర్శకత్వంలో ట్రైయాంగిల్ లవ్ స్టోరీ గా రూపొందింది. ఈ సినిమాలో నాగబాబు, లిరీష, కుసుమ, సాత్విక్, విరాజ అశ్విన్ కీరోల్స్ ప్లే చేశారు. జూలై 14న రిలీజ్ అయిన ఈ సినిమా యూత్‌ని బాగా ఆకట్టుకుంది.
తొలి రోజు తొలి షో తోనే పాజిటివ్ టాక్ సంపాదించుకోవడంతో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ వసూలు చేస్తుంది. ఇక ఈ సినిమా చూసిన వారంతా వైష్ణవి చైతన్య బస్తి అమ్మాయిగా, గ్లామర్ గర్ల్ గా ఇలా రెండు పాత్రలను అద్భుతంగా నటించిందని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ ఎవరు? ఈ అమ్మాయి అనే దానిపై సెర్చింగ్ స్టార్ట్ అయ్యింది. వైష్ణవి చైతన్య ఎవరు? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి? ఆమె కెరియర్ ఎలా? స్టార్ట్ అయిందో చూస్తే ఆసక్తికర విషయాలే బయటకు వస్తాయి.
ఢిల్లీలో పుట్టిన వైష్ణవి చైతన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. విజయవాడ, హైదరాబాద్‌లో పెరిగింది. వైష్ణవి చైతన్య చిన్నప్పటినుంచి మంచి డ్యాన్సర్. స్కూల్ డేస్ నుంచి చాలా స్టేజ్ పెర్ఫార్మన్స్ లు ఇచ్చిన వైష్ణవి టిక్ టాక్, డబ్‌స్మాష్ వీడియోలతో పాపులారిటీ సంపాదించుకుంది. ఆ టైంలోనే యూట్యూబ్లో కంటెంట్ క్రియేటర్.. బిగ్‌బాస్ కంటెస్టెంట్ షణ్ముఖ్ జశ్వంత్ హీరోగా నటించిన సాఫ్ట్‌వేర్ డెవలపర్ షార్ట్ ఫిలింస్‌లో అవకాశం రావడంతో వైష్ణవి చైతన్య అందులో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తర్వాత సొంతంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి భారీ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. పలు కవర్ సాంగ్స్ లో నటించిన వైష్ణవి వెండితెరపై అలవైకుంఠపురం, టక్ జగదీష్, రంగ్ దే, వరుడు కావలెను సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చిన్న చిన్న రోల్స్ ను ప్లే చేసింది. ఇలా ఎనిమిది సంవత్సరాలు కష్టపడిన వైష్ణవికి బేబీ సినిమాతో హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. తొలి సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న వైష్ణవికి మరిన్ని ఆఫర్లు రావడం.. ఆమె టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలగడం ఖాయంగా కనిపిస్తోంది.