బ్లాక్‌బ‌స్ట‌ర్ ‘ బేబీ ‘ సినిమా మిస్ చేసుకున్న శ్రీలీల‌… డైరెక్ట‌ర్‌ను అవ‌మానించి దూల తీర్చుకుందిగా..!

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా.. యూట్యూబర్‌ వైష్ణవి చైతన్య హీరోయిన్గా తెరకెక్కిన సినిమా ‘ బేబీ ‘. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా నేటి తరం పిల్లలు ప్రేమ విషయంలో ఎలాంటి ? తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు.. ఎలా ? అట్రాక్షన్ కి గురై చిన్న వయసులోనే తప్పులు చేస్తున్నారు. ఒకరి చేతిలో మరొకరు ఎలా ? మోసపోతున్నారు అనే విషయాన్ని క్లియర్ కట్‌గా క‌ళ్ల‌కు కట్టినట్టు చూపించారు.

ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ని సొంతం చేసుకుంది. ఆనంద్ దేవరకొండ కెరీర్‌లోనే ఇది మొదటి హిట్ సినిమా కావడం విశేషం. ఇలాంటి ఓ సూపర్ హిట్ కథలో హీరోయిన్‌గా వచ్చిన ఛాన్స్‌ మిస్ చేసుకుంద‌ట ఓ టాలీవుడ్ స్టార్ హీరోయిన్. ఆ హీరోయిన్ ఎవ‌రో కాదు. ప్రస్తుతం వరుస‌ సినిమా షూటింగ్‌ల‌లో బిజీగా ఉన్న శ్రీ లీల.

డైరెక్టర్ సాయి రాజేష్ ఈ సినిమాలో హీరోగా ఆనంద్‌ని అనుకోకముందే హీరోయిన్గా శ్రీ లీల‌ అయితే బాగా సెట్ అవుతుంద‌నుకుని ఆమెనే క‌లిశాడ‌ట‌. సాయి రాజేష్ చిన్న డైరెక్టర్ అని తెలుసుకున్న శ్రీ లీల కథ కూడా వినకుండా సినిమాను రిజెక్ట్ చేసిందట. త‌ర్వాత‌ యూట్యూబర్‌ వైష్ణవి చైతన్య పేరు రాజేష్ కి మైండ్ లో స్ట్రైక్ అవ‌టం.. ఆ తర్వాత హీరోగా ఆనంద్ దేవరకొండని, సెకండ్ హీరోగా విరాజ్ అశ్విన్‌ని సెలెక్ట్ చేసి సినిమాను తెరకెక్కించ‌డం జ‌రిగింది.

ప్రస్తుతం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతుంది. అస‌లు రెండు రోజుల్లోనే ఏకంగా రు. 14 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఇక‌ శ్రీ లీల ఈ సినిమా అవకాశాన్ని మిస్ చేసుకుందని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో చాలామంది నెటిజ‌న్లు శ్రీ‌లీలపై ఫైర్ అవుతున్నారు. వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి అన్న తల పొగరా..? చిన్న డైరెక్టర్ అని సినిమా అవకాశం ఇవ్వలేదా..? ఇప్పుడు దూల తీరిపోయిందా..? అంటూ కామెంట్ చేస్తున్నారు.