ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఎన్నో సినిమాల్లో హీరోగా నటించాడు ఎస్‌వి రంగారావ్. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్‌కి ధీటుగా నటించిన హీరోగా ఎస్‌వీఆర్‌కు మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత సీనియర్ ఎన్టీఆర్ తో పోటీ పడుతూ కృష్ణ కూడా కొన్ని సినిమాలను పోటీగా రిలీజ్ చేశారు. వాటిలో కొన్ని హిట్.. కొన్ని ప్లాప్‌గా నిలిచాయి. ఎన్టీఆర్‌తో పోటిగా నటించిన ఎస్‌వి రంగారావు, కృష్ణ మధ్య ఓ ఛాలెంజ్ నడిచిందట. ఇంతకీ ఎస్వీ రంగారావు కృష్ణకు చేసిన ఆ ఛాలెంజ్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం.
ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగిన కృష్ణ 10 ఏళ్లలో 100 కి పైగా సినిమాల్లో నటించి రికార్డును సృష్టించాడు. దాదాపు 350 పైగా సినిమాల్లో నటించిన హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. తరువాత తన సోదరులతో కలిసి ప్రొడ్యూసర్‌గా మారాడు. కృష్ణ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన సినిమాల్లో ” పండంటి కాపురం ” సినిమా ఒకటి. ఇందులో సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల జంటగా నటించారు.
ఈ సినిమా హిందీలో సూపర్ హిట్ ” సునేహ్రా సన్సార్ ” అనే మూవీకి రీమేక్ గా తెలుగులో తెరకెక్కించారు. ఈ సినిమా తెలుగులో కూడా సూపర్ డూపర్ హిట్. ఓ రోజు షూటింగ్‌లో ఎస్వీఆర్ ఎక్కువగా తాగి షూటింగ్ కి రాలేదట. అప్పటికే కృష్ణ, విజయనిర్మల, గుమ్మడి, అంజలి దేవి, జమున, బి సరోజా దేవి, ప్రభాకర్ రెడ్డి ఇలా కీరోల్స్ ప్లే చేసిన నటులందరూ ఆయన కోసం ఎదురు చూస్తున్నారట. ఎస్వీఆర్ రాక షూటింగ్ ఆగిపోయింది. దీంతో ఈ విషయం సెట్‌లో ఉన్న సెలెబ్రిటీలందరికీ తెలిసి చాలా మంది రంగారావు మీద ఫైర్ అయ్యారట.
వెంటనే ఆయన్ను ఈ రోల్ నుంచి తప్పించేయాలని కూడా కండీషన్ పెట్టారట. హీరో కృష్ణ మాత్రం ఆయనకి ఇచ్చిన పాత్రను ఇంకెవరు చేయలేరు.. ఆయన వచ్చినప్పుడే షూటింగ్ చేద్దామని వెళ్లిపోయారట. దీంతో మరుసటి రోజు ఎస్ వి రంగారావ్.. కృష్ణ ఆయనపై పెట్టుకున్న నమ్మకానికి ఆయన చేసిన పనికి సిగ్గు తెచ్చుకున్నారట. తాను మళ్లీ ఎప్పుడూ తాగనని కృష్ణకి చెప్పాడట. కావాలంటే ఛాలెంజ్ చేస్తున్నానన్న ఎస్వీఆర్ అప్పటినుంచి త్రాగుడు మానేశారట.