శారీతో సాంప్రదాయంగా కనిపిస్తున్న ఈ హీరోయిన్ తెలుగులో పెద్ద హాట్ సినిమాలో నటించింది.. ఎవరో గుర్తుపట్టారా..?

ఆ పై ఫోటోలో అంత సాంప్రదాయ బద్ధంగా కనిపిస్తున్న స్టార్ హీరోయిన్ ఎవరో ? తెలుసా. ఆమె మ‌న తెలుగులోనే ఓ సినిమాలో హాట్ హీరోయిన్‌గా చేసింది. ఆమె ఎవ‌రో కాదు డెబీనా బెనర్జీ. ఇలా కాదు గాని అమ్మాయిలు అబ్బాయిలు మూవీ హీరోయిన్ అంటే టక్కున గుర్తుపడతారు. రవిబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమా 2003లో రిలీజ్ అయి మంచి సక్సెస్ సాధించింది ఇందులో మోహిత్, విజయ సాయి, డెబీనా కీరోల్స్ ప్లే చేశారు. సోనుసూద్, రమ్యశ్రీ, చలపతిరావు, రవిబాబు, సుబ్రహ్మణ్యం కీల‌క పాత్ర‌ల‌లో నటించారు.

సినిమా పరిశ్రమలో తమ అందం, అభినయంతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న హీరోయిన్స్ చాలామంది ఉంటారు. అలానే టాలీవుడ్ లో ఒకటి, రెండు సినిమాలు చేసినా ఇప్పటికీ ప్రేక్షకులు వారి గురించి తెలుసుకునేంత క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్‌లు కూడా ఉన్నారు. అలాంటి హీరోయిన్స్‌లో డేబీన బెనర్జీ ఒకరు. అమ్మాయిలు అబ్బాయిలు సినిమాలో అందం, అమాయకత్వం, అంతకుమించిన నటనతో..త‌న అందాలు ఆర‌బోస్తు ప్రేక్షకులను ఆకట్టుకుంది డెబీనా.

కలకత్తాలోని వెస్ట్ బెంగాల్ కు చెందిన డెబినా 2003లో ఇండియన్ బాబు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత టాలీవుడ్ కి అమ్మాయిలు అబ్బాయిలు సినిమాతో పరిచయమైంది. ఈ సినిమాలో గ్లామర్ షో తో కుర్రకారుని ఉరూత‌లుగించిన డేబినాకి ఆ తర్వాత తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు.
కానీ ఈ సినిమాలో ఆమె న‌ట‌న‌తో మాత్రం కుర్ర‌కారు ద‌గ్గ‌ర బాగా పాపుల‌ర్ అయ్యింది.

ఈ సినిమాలోని నటించి తరువాత పదేళ్లకు జగపతిబాబు నటించిన సిక్స్ సినిమాలో మెరిసింది. కొన్ని తమిళ్, హిందీ టీవీ సీరియల్స్ లో నటించింది. 2011లో యాక్టర్ గుర్మీత్ చౌదరిని వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. ప్రస్తుతం హిందీలో కొన్ని సీరియల్స్ లో నటిస్తూనే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తుంది. ఎప్పటికప్పుడు సోష‌ల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటు తన ఫ్యామిలీ ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటుంది.