ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల హైదరాబాద్‌లో రీసెంట్‌గా AAA అనే మల్టీప్లెక్స్ థియేటర్ ప్రారంభించి.. ఈ బిజినెస్ రంగంలోకి ఎంటర్ అయ్యారు. ఆసియన్ వాళ్లతో కలిసి బన్నీ మల్టీఫ్లెక్స్ నిర్మించారు. అమీర్‌పేటలో గతంలో ఉన్న సత్యం థియేటర్ స్థానంలోనే ఈ కొత్త మల్టీఫ్లెక్స్ థియేటర్ స్టార్ట్ చేశారు. మొత్తం 5 స్క్రీన్లు ఈ కాంప్లెక్స్‌లో ఉన్నాయి.
ఇక ఇప్పుడు బన్నీ అదే ఏషియన్ వాళ్లతో కలిసి ఏపీలోనూ ఓ మల్టీఫ్లెక్స్ నిర్మించే ఆలోచనల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ బ్రాండ్‌ను మరింతగా విస్తరించేందుకు ఈ సారి బన్నీ ఏపీలో తన సొంత ఊరును ఎంచుకున్నట్టు తెలుస్తోంది. బన్నీ సొంత ఊరు ఏదో కాదు.. పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు. పాలకొల్లు నడిబొడ్డున ఉన్న విశాలమైన స్థలం బన్నీదే అంటారు.
ఈ క్రమంలోనే ఇక్కడ అల్లు అరవింద్‌కు ఓ థియేటర్ ఉంది. అది కాకుండా బన్నీ ఓన్‌గా ఏషియన్ వాళ్లతో కలిసి మల్టీఫ్లెక్స్ నిర్మించే ఆలోచనల్లో ఉన్నాడని తెలిసింది. ఈ క్రమంలోనే ఇప్పుడు చర్చలు అయితే జరుగుతున్నాయి. ఏషియన్ వాళ్లు ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా స్టార్ హీరోల భాగస్వామ్యంతో మల్టీఫ్లెక్స్‌లు నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఏపీలో బన్నీతో కలిసి మరో మల్టీఫ్లెక్స్ నిర్మించేందుకు కూడా ఆసక్తి చూపిస్తున్నారట.
ఇక పాలకొల్లుపై బన్నీకి ఎప్పుడూ మమకారం ఉంది. ఇక్కడ సరైన థియేటర్లు లేవు. పాలకొల్లు పక్కనే ఉన్న భీమవరంలో మాత్రమే నాలుగు స్క్రీన్ల మల్టీఫ్లెక్స్ ఉంది. ఈ క్రమంలోనే ఇప్పుడు తన సొంత ఊరు ప్రజలకు, సినీ అభిమానులకు మల్టీఫ్లెక్స్ అనుభూతి పంచేందుకే బన్నీ ఇక్కడ మల్టీఫ్లెక్స్ కట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కొత్త మల్టీఫ్లెక్స్ కూడా నాలుగు స్క్రీన్లతో ఉండబోతోందంటున్నారు.